Moviesశేఖర్ కమ్ముల, నాగార్జునలలో ఈ కామన్ పాయింట్స్ ఎప్పుడైనా గమనించారా..?

శేఖర్ కమ్ముల, నాగార్జునలలో ఈ కామన్ పాయింట్స్ ఎప్పుడైనా గమనించారా..?

ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లయితే సులభంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చు, ఇక చదువు లేకపోయినా కూడా వాళ్ళకి పెద్దగా తేడా ఏమీ ఉండదు అని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే అలా అనుకుంటే పొరపాటే అని చెప్పాలి.. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల నుంచి దర్శకనిర్మాతల వరకు ఉన్నత చదువులు అభ్యసించిన తరువాత సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. అందులో కొంతమంది డాక్టర్లు కావాల్సిన వాళ్ళు యాక్టర్లు కూడా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాదు కొంతమంది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ లు కూడా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మెకానికల్ ఇంజనీర్స్ కూడా సినిమాలలో నటిస్తున్నారు. ఇంజనీరింగ్ పట్టా చేతపట్టుకుని ఇండస్ట్రీ కి వచ్చారు.. అందులో ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగార్జున, శేఖర్ కమ్ముల లాంటి వాళ్లు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి సినిమాల్లోకి అడుగు పెట్టారు. తమిళంలో అయితే గౌతమ్ మీనన్ , కార్తీ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఇకపోతే ఇంజనీరింగ్ చదివి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆ ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం.. తెలుగులో కింగ్ నాగార్జున , తమిళ హీరో కార్తీ, ఫ్యామిలీ దర్శకుడు శేఖర్ కమ్ముల, గౌతమ్ మీనన్, దేవా కట్ట, సెల్వరాఘవన్, నవీన్ చంద్ర, తరుణ్ భాస్కర్, అవసరాల శ్రీనివాస్ వంటి వారందరూ ఇంజనీరింగ్ చేతపట్టుకొని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

వీళ్లే కాదు చాలా మంది ఉన్నత చదువులు చదివిన తరువాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటనా నైపుణ్యంతో తమకు అంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఉన్నత చదువులు చదువుకున్న వారు చాలా మంది సినీ ఇండస్ట్రీలో ఉండడం మనకు గర్వకారణం. పెద్దపెద్ద చదువులు పూర్తి చేసిన అనంతరం నటనలో శిక్షణ పొంది , సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారు ఇంకా చాలామంది ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news