Moviesఈ ఫొటోలో పాప ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు...

ఈ ఫొటోలో పాప ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా…!

ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న హీరో, హీరోయిన్లు త‌మ చిన్న‌ప్ప‌టి జ్ఞాప‌కాల‌ను నెమ‌ర వేసుకోవ‌డం ఓ ట్రెండ్‌గా మారింది. చాలా మంది తార‌లు త‌మ చిన్న‌ప్ప‌టి ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటూ త‌మ ఫాలోయింగ్‌ను మ‌రింత‌గా పెంచుకుంటున్నారు. అయితే అప్ప‌టి ఫొటోలు, ఇప్ప‌టి ఫొటోలు ప‌క్క‌న పెట్టి కంపేరిజ‌న్ చేస్తే అవి గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా ఉంటున్నాయి.

ఇటీవ‌లే అనుష్క‌, అంజ‌లి, హ‌న్సిక‌, స‌మంత చిన్న‌ప్ప‌టి ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఇక తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్న‌ప్ప‌టి క్యూట్ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోలో చార‌డేసి క‌ళ్ల‌తో పాటు చాలా క్యూట్‌గా క‌నిపిస్తోన్న మూడేళ్ల పాప ఎవ‌రో.. ఆమె ఇప్పుడు ఏ స్టార్ హీరోయినో మీరు గుర్తు ప‌ట్టారో లేదో కాని.. ఆమె ఎవ‌రో కాదు సాయి ప‌ల్ల‌వి.

సాయి ప‌ల్ల‌వి త‌న బాల్యం ఫొటోను త‌న ఇన్ స్టా ద్వారా అభిమానుల‌కు షేర్ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ప‌లువురు చిన్న‌ప్ప‌టి సాయి ప‌ల్ల‌వి క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రేమ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన సాయి ప‌ల్ల‌వి ఫిదా, ల‌వ్‌స్టోరీ, ఎంసీఏ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌తో దూసుకు పోతోంది.

ఇక తెలుగులో మాత్ర‌మే కాదు.. కోలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక తాజాగా సాయి ప‌ల్ల‌వి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ల‌వ్‌స్టోరీతో మ‌రో సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. అలాగే నాని ప‌క్క‌న న‌టించిన శ్యామ్ సింగరాయ్ కూడా డిసెంబ‌ర్లో రిలీజ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news