Moviesగీతా ఆర్ట్స్‌లో బాల‌య్య సినిమా... ఆ డైరెక్ట‌ర్ ఫిక్స్‌..?

గీతా ఆర్ట్స్‌లో బాల‌య్య సినిమా… ఆ డైరెక్ట‌ర్ ఫిక్స్‌..?

గీతా ఆర్ట్స్ అనగానే మెగా బ్యానర్ అన్న టాక్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఎదుగుద‌ల‌లో ఈ బ్యాన‌ర్ కృషి ఎంతో ఉంది. చిరంజీవిని మెగాస్టార్‌గా నిల‌బెట్టేందుకు అర‌వింద్ ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో సినిమాలు చేశారు. అర‌వింద్‌కు సినిమా నిర్మాణంలో ఎంత అభిరుచి ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఖ‌చ్చితంగా హిట్ అయ్యే క‌థే అర‌వింద్ ఎంచుకుంటారు. ఇటీవ‌లే అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమాను తెర‌కెక్కించి హిట్ కొట్టారు.

ఇక ఇప్పుడు ఈ మెగా బ్యాన‌ర్‌తో నంద‌మూరి హీరో బాల‌య్య బంధం అల్లుకుంటోన్న‌ట్టే క‌నిపిస్తోంది. అర‌వింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో చేస్తున్నారు. ఈ షోతో అల్లు – బాల‌య్య బంధం స్ట్రాంగ్ అవ్వ‌గా.. ఇప్పుడు గీతా బ్యాన‌ర్లోనే బాల‌య్య హీరోగా ఓ సినిమాకు అర‌వింద్ టీం ప్లాన్ చేస్తోంద‌ట‌. ఈ షో ఫ‌స్ట్ ఎపిసోడ్ ఇప్ప‌టికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది.

ఈ క్ర‌మంలోనే ఈ షోకు మంచి టాక్ వ‌చ్చింది. ఈ షో షూటింగ్ జ‌రుగుతున్న టైంలోనే బాల‌య్య – అర‌వింద్ మ‌ధ్య గీతా బ్యాన‌ర్లో సినిమా చేసే అంశం కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింద‌ట‌. ఈ సినిమాకు బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అలాగే క్రిష్ కాని ప‌క్షంలో డేరింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంది. వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్ త‌ర్వాత ఈ సినిమా ఎప్పుడు అయినా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ఏదేమైనా అల్లు తో నంద‌మూరి బంధం బాగా స్ట్రాంగ్ అవుతోన్న ప‌రిస్థితే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news