Moviesబాల‌య్య స‌మ్మ‌ర్‌కు మ‌ళ్లీ వ‌చ్చేస్తున్నాడోచ్‌...!

బాల‌య్య స‌మ్మ‌ర్‌కు మ‌ళ్లీ వ‌చ్చేస్తున్నాడోచ్‌…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఈ వ‌య‌స్సులో కూడా స్పీడ్‌గా సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. 2019లో ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో భాగంగా క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు సినిమాలు చేసిన బాల‌య్య ఆ యేడాది చివ‌ర్లో రూల‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ మూడు సినిమాలు ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకోలేదు. ఆ త‌ర్వాత కరోనాతో యేడాదిన్న‌ర కాలంగా సినిమాల షూటింగ్‌లు లేవు. ఇక ఇప్పుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.

అఖండ డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. బాల‌య్య – బోయ‌పాటి కాంబినేష‌న్లో ఉన్న అంచ‌నాల నేప‌థ్యంలో అఖండ ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు హ్యాట్రిక్ హిట్ అవుతుంద‌నే అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే బాల‌య్య నెక్ట్స్ రెండు సినిమాలు లైన్లో పెట్టేశాడు. క్రాక్‌తో హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్న మ‌లినేని గోపీచంద్‌తో పాటు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు.

బాల‌య్య ఫ్యాన్స్‌కు సూప‌ర్ ధ‌మ‌కా ఏంటంటే మ‌లినేని గోపీచంద్ సినిమాను స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఇప్పుడు అఖండ రావ‌డం.. ఆ వెంట‌నే నాలుగైదు నెల‌ల‌కే బాల‌య్య మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తే అంత‌కు మించి బాల‌య్య అభిమానుల‌కు కావాల్సిన ఆనందం ఏం ఉంటుది..
ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

బాల‌య్య – శృతి కాంబినేష‌న్లో తొలి సినిమా కావ‌డంతో ఇటు ప్రేక్ష‌కుల్లో కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి. పైగా మ‌లినేని గోపీచంద్ అదిరిపోయే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ను బాల‌య్య కోసం రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బాల‌య్య డ‌బుల్ రోల్ చేస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news