Moviesథ‌మ‌న్‌ను బాగా డిజ‌ప్పాయింట్ చేసిన ఎన్టీఆర్ సాంగ్‌

థ‌మ‌న్‌ను బాగా డిజ‌ప్పాయింట్ చేసిన ఎన్టీఆర్ సాంగ్‌

దివంగత లెజెండరీ సింగర్ ఘంటసాల బలరామయ్య మ‌నవ‌డిగా ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న థ‌మన్ తెలుగు సినీ రంగంలో దూసుకుపోతున్నారు. థ‌మ‌న్ తెలుగు సినిమా పాట‌కు కొత్త ఉత్సాహం, ఊపు తెచ్చాడు. చాలా త‌క్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసి పాపుల‌ర్ అయిపోయాడు. తెలుగులో అంద‌రు స్టార్ హీరోల‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు ఇచ్చాడు. ఒకానొక టైంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ స్థాయికి కూడా పోటీ ప‌డ్డాడు.

ఇక స్టార్ హీరోలు కూడా త‌మ సినిమాల‌కు థ‌మ‌నే మ్యూజిక్ ఇవ్వాల‌ని మ‌రీ ప‌ట్టుబ‌ట్టి పెట్టుకుంటున్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి వాళ్లు థ‌మ‌న్‌తోనే స్పెష‌ల్ సాంగ్‌లు చేయించుకుంటారు. అస‌లు బ‌న్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన అల వైకుంఠ‌పుర‌ములో సూప‌ర్ హిట్ అవ్వ‌డంలో ఆ సినిమా ఆల్బ‌మ్ ఎంత కీల‌క పాత్ర పోషించిందో తెలిసిందే.

అయితే తాజాగా ఓ ప్ర‌ముఖ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో తాను ఎంతో క‌ష్ట‌ప‌డి చేసినా జ‌నాల‌కు రీచ్ కాని ఓ సాంగ్ గురించి థ‌మ‌న్ చెప్పాడు. ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాలో ఏడబోయినాడో అనే పాట కోసం థ‌మ‌న్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు అట‌. పైగా వైజాగ్ అమ్మాయి నిఖిత వాయిస్ అయితేనే ఆ పాట‌కు సెట్ అవుతుందని.. ఆమెనే పిలిపించి మ‌రీ పాడించాడు అట‌.

ఆ పాట‌కు ఆ ఫీల్ తెచ్చేందుకు తాము ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం అని… ఆ మూడ్‌ను తాను అనుభ‌వించి మ‌రీ ఆ సాంగ్ అంత బాగా వ‌చ్చేలా చేశాన‌ని గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ సినిమాలో పెనివిటి, రెడ్డి ఇక్క‌డ సూడు పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని.. ఏడ‌బోయినాడో పాట‌కు అనుకున్న గుర్తింపు రాలేద‌ని థ‌మ‌న్ చెప్పాడు. ఒక్కోసారి మ‌నం కొన్ని పాట‌ల‌కు ఎంత కాన్‌సంట్రేష‌న్ చేసి వ‌ర్క్ చేసినా కూడా అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ ఉండ‌క‌పోవ‌డం కాస్త బాధ క‌లిగిస్తుంద‌ని థ‌మ‌న్ చెప్పాడు

Latest news