Moviesవ‌య‌స్సు ముదురుతున్నా త‌గ్గ‌ని అనుష్క క్రేజ్‌... ఈ రేంజ్‌లోనా..!

వ‌య‌స్సు ముదురుతున్నా త‌గ్గ‌ని అనుష్క క్రేజ్‌… ఈ రేంజ్‌లోనా..!

సౌత్ ఇండియ‌న్ హీరోయిన్ల‌లో గ‌త 15 సంవ‌త్స‌రాలుగా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతోంది అనుష్క‌. క‌ర్నాక‌ట‌లోని మంగ‌ళూరుకు చెందిన ఈ యోగా టీచ‌ర్ 2005లో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా వ‌చ్చిన సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డం, మ‌ళ‌యాళ సినిమాల్లో స్టార్ హీరోలు అంద‌రితోనూ క‌లిసి నటించి ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టింది. కేవ‌లం హీరోయిన్‌గా హీరోల ప‌క్క‌న రొమాన్స్‌కు మాత్ర‌మే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల‌తో కూడా బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టి తానేంటో ఫ్రూవ్ చేసుకుంది.

అరుంధ‌తి – పంచాక్ష‌రి – బాహుబ‌లి – రుద్ర‌మ‌దేవి – భాగ‌మ‌తి ఇలా ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అనుష్క సొంతం. ఇప్ప‌టికే నాలుగు ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అవుతోన్న అనుష్క ఇప్పుడు కెరీర్‌లో యువ హీరోయిన్ల పోటీకి త‌ట్టుకోలేక కాస్త వెన‌క ప‌డ్డార‌నే చెప్పాలి. అయితే ఇప్ప‌ట‌కీ ఆమెకు ఛాన్సులు వ‌స్తూనే ఉంటున్నాయి. ఆమె ఇటీవ‌ల ఎక్కువుగా సినిమాల్లో క‌నిపించ‌క‌పోయినా కూడా ఆమెకు క్రేజ్ మ‌రింత పెరుగుతుండ‌డం విశేషం.

ట్విట్ట‌ర్ స్థానంలో స్వ‌దేశీ మైక్రోబ్లాగింగ్ యాప్‌గా శ‌ర‌వేగంగా దూసుకుపోతోన్న కూ యాప్ ఇప్పుడు బాగా ఫేమ‌స్ అవుతోంది. రాజ‌కీయ నాయ‌కులే కాకుండా.. సెల‌బ్రిటీలు కూడా ఈ యాప్ అక్కౌంట్లు ఓపెన్ చేయ‌డంతో పాటు దీనినే ఎక్కువుగా వాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే అనుష్క శెట్టి కూడా నాలుగు నెల‌ల క్రిత‌మే ఈ కూ యాప్ ఖాతా ప్రారంభించారు. కేవ‌లం 4 నెల‌ల్లోనే ఆమెకు కూ లో 10 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఏర్ప‌డ్డారు. ఇటీవ‌లే 40వ పుట్టిన రోజు జ‌రుపుకున్న అనుష్క‌కు ఏ మాత్రం క్రేజ్ త‌గ్గ‌డం లేద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news