Moviesబిగ్‌బాస్ గంగ‌వ్వ ఫ్యామిలీలో విషాదం.. గృహ‌ప్ర‌వేశం వేళే దారుణం...!

బిగ్‌బాస్ గంగ‌వ్వ ఫ్యామిలీలో విషాదం.. గృహ‌ప్ర‌వేశం వేళే దారుణం…!

బిగ్‌బాస్ షో తో రెండు తెలుగు రాష్ట్రాల్లో గంగ‌వ్వ ఎంత పాపుల‌ర్ అయ్యిందో మ‌నం చూశాం. తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లా మాల్యాల మండ‌లానికి చెందిన గంగ‌వ్వ మై విలేజ్ షోతో పిచ్చ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ త‌ర్వాత ఆమె వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఆమెను ఏకంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా చేశాయి. గంగ‌వ్వ బిగ్‌బాస్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు ఆమె త‌న సొంత ఇంటి క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని అనుకుంటున్నాన‌ని చెప్పింది.

అప్పుడు హోస్ట్ నాగార్జున స్వ‌యంగా తానే గంగ‌వ్వ‌కు ఇళ్లు క‌ట్టిస్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో గంగ‌వ్వ బిగ్‌బాస్‌లో గెలుచుకున్న రు. 11 లక్ష‌ల‌తో పాటు నాగార్జున ఇచ్చిన రు. 7 ల‌క్ష‌లకు తోడుగా మ‌రో రు. 3 ల‌క్ష‌లు అప్పులు చేసి గంగ‌వ్వ త‌న సొంత ఇంటిని క‌ట్టుకున్నారు. ఇటీవ‌లే ఆమె కొత్త ఇంటి గృహ ప్ర‌వేశం కూడా జ‌రిగింది. ఈ గృహ ప్ర‌వేశానికి అఖిల్‌, సావిత్రి కూడా వ‌చ్చారు. ఇక చొప్ప‌దండి ఎమ్మెల్యే సుంకే ర‌విశంక‌ర్ కూడా వ‌చ్చారు.

అయితే ఈ గృహ ప్ర‌వేశం వేళ గంగ‌వ్వ సంతోషంగా లేరు. ఆమె త‌మ్ముడు కొడుకు చ‌నిపోవ‌డంతో గంగ‌వ్వ‌తో పాటు ఆమె కుటుంబం అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉద్యోగం చేసే టైంలోనే త‌న త‌మ్ముడు కొడుకుకు పెళ్లి చేశార‌ట‌. అయితే ఆ త‌ర్వాత ఉద్యోగం మానేసి ట్రాక్ట‌ర్ కొన్నాడ‌ట‌.. త‌ర్వాత చెడు అల‌వాట్ల‌కు బానిస కావ‌డంతో పాటు తాగుడుకు అల‌వాటు ప‌డ్డాడ‌ని.. ఈ క్ర‌మంలోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని గంగ‌వ్వ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news