Moviesబిగ్గెస్ట్ అగ్ని పరీక్షను ఎదురుకోబోతున్న యంగ్ హీరో కార్తికేయ..!!

బిగ్గెస్ట్ అగ్ని పరీక్షను ఎదురుకోబోతున్న యంగ్ హీరో కార్తికేయ..!!

యంగ్ హీరో కార్తికేయ.. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యి..మొదటి సినిమాతొనే అదరగొట్టేసారు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు బడా హీరోలుకూడా మెచ్చుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర కాసులు వర్షం కురిపించడమే కాదు..కార్తికేయకు మంచి విజయం సాధించడంతో పాటు.. అందరిని మనసులను గెలుచుకుంది. ఇక ఆ తరువాత ఈ హీరో కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

‘ఆర్ఎక్స్ 100’తో మంచి పాపులారిటీ సంపాదించిన కార్తికేయ.. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఓకే చేసేశాడు. ఎడాపెడా సినిమాలు చేసేశాడు. కట్ చేస్తే మూడేళ్లు తిరిగేసరికి అరడజను ఫ్లాపులు అతడి ఖాతాలో చేరాయి. చివరగా కార్తికేయ నుంచి వచ్చిన ‘చావు కబురు చల్లగా’ కూడా డిజాస్టర్ కావడం తెలిసిందే. దీంతో ఈ హీరోని ఆచు తూచి అడుగులు వేస్తున్నాడు. ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన స్థితిలో ఉన్నాడతను.

ప్రస్తుతం ఈ హీరో ప్రస్తుతం ‘రాజావిక్రమార్క’ అనే సినిమా చేస్తున్నారు. శ్రీసరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ,
టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో ఫుల్ కామెడీని కూడా జోడించారు. ఇక ఈ సినిమాలో కార్తికేయ రహస్య ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస ఫ్లాప్ లో ఉన్న హీరో కార్తికేయ కి..ఈ సినిమా కెరీర్లో చాలా ముఖ్యమైనది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news