Moviesమహేశ్‌ బాబుకు కలిసోచ్చిన నాగచైతన్య లవ్ స్టోరీ..!!

మహేశ్‌ బాబుకు కలిసోచ్చిన నాగచైతన్య లవ్ స్టోరీ..!!

అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్ స్టొరీ మొత్తంగా వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. మొదటిరోజు నుంచే అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది చైతు – సాయి పల్లవిల లవ్ స్టోరి. ఈ మూవీపై పలువురు టాలీవుడ్ సినీ తారలు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రశంసల జల్లు కురిపించారు.

లవ్ స్టొరీ మొత్తంగా వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని కలెక్షన్స్ సాధించింది. అయితే తాజా లెక్కలు చూసుకుంటే నాగచైతన్య లవ్ స్టోరీ సూపర్ స్టార్ మహేష్ బాబు కి బాగా కలిసోచ్చిన్నట్లు తెలుస్తుంది. మహేష్ బాబు ఏషియన్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఏఎంబీ మల్టీ ప్లెక్స్ లో సెకండ్ వేవ్ తర్వాత అరుదైన రికార్డ్ నమోదు అయ్యింది.

ఏఎంబీ సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌. సెకండ్ వేవ్ త‌ర్వాత ఈ మల్టీప్రెక్స్‌లో కోటి రూపాయ‌లు వసూలు చేసిన తొలి చిత్రంగా లవ్‌స్టోరీ నిలిచిందట. ఇటీవల విడుదల అయిన లవ్ స్టోరీ సినిమా ఏఎంబీ థియేటర్ లో కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 251 షో లు లవ్ స్టోరీ ని ఏఎంబీలో ప్రదర్శించారు. ఇప్పటి వరకు మొత్తంగా 48233 మంది లవ్ స్టోరీ సినిమాను చూశారు. ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్‌లో కోటి రూపాయ‌ల వ‌సూళ్లు సాధించిన చిత్రాలు చాలా అరుదుగా ఉంటాయ‌ని చెప్పొచ్చు. స్టార్ హీరోల‌ సినిమాలకు మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే క‌లెక్ష‌న్ల‌ను సాయి ప‌ల్ల‌వి-నాగ చైతన్యల ‘లవ్‌స్టోరీ’ చిత్రం రాబ‌ట్ట‌డం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news