Moviesజగపతిబాబునే కావాలి అని అడిగి మరీ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన...

జగపతిబాబునే కావాలి అని అడిగి మరీ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బడా హీరో ఎవరో తెలుసా..?

జగపతి బాబు.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో క్రేజ్​ తెచ్చుకున్న జగపతి బాబు.. ఆ తర్వాత ఆర్థికంగా నష్టపోయాడు. వరుస ప్లాప్​లతో సతమతమయ్యాడు. కానీ జగపతి బాబు సెకండ్​ ఇన్సింగ్స్​లో అనూహ్యంగా సక్సెస్​ అయ్యాడు. అయితే హీరోగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న జగపతి బాబుకు బాలయ్య లెజెండ్​లో విలన్​ గా అవకాశం రావడం ఆయన కెరీర్​ను మలుపు తిప్పింది. దీంతో జగపతిబాబు నటనకు దక్షిణాది మొత్తం ఫిదా అయ్యింది. దీంతో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి.

తాజాగా ఈయనకు బాలీవుడ్‌ నుండి పిలుపు వచ్చిన్నట్లు తెలుస్తుంది. అయితే ఇన్నాళ్లు హిందీ సినిమాల్లో ఛాన్సులు వచ్చినా..అక్కడ నటించే ఆసక్తి లేకపోవడంతో ఇన్ని రోజులు నో చెబుతూ వచ్చిన జగ్గుభాయ్.. తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ తాజా బజ్‌ ప్రకారం ఆయన త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో, ఫర్హాన్ అక్తర్ హీరోగా ‘పుకార్’ అనే సినిమా రూపొందనుంది. ఫర్హాన్‌ అక్తర్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో జగపతిబాబు మెయిన్‌ విలన్‌ రోల్‌ పోషించనున్నారట.

ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. జావేద్‌ అక్తర్‌ కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి భారీ రేంజ్‌లో రెమ్యునరేషన్ కూడా అందుకొనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఆఫర్‌ను అంగీకరించడంతో బాలీవుడ్‌లో మరిన్నీ అవకాశాలు జగపతి బాబు తలుపు తడుతున్నట్టు తెలుస్తుంది. పలు నిర్మాణ సంస్థలు కొన్ని పాత్రలను ఆయన ముందుకు తెచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఆఫర్లపై ఆచీతూచీ వ్యవహరిస్తున్నారట జగపతిబాబు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news