Gossipsవావ్: టాలీవుడ్ బడా డైరెక్టర్ తో బాలీవుడ్ కండల వీరుడు సినిమా..అభిమానులకు...

వావ్: టాలీవుడ్ బడా డైరెక్టర్ తో బాలీవుడ్ కండల వీరుడు సినిమా..అభిమానులకు పూనకాలే..?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోను ఆయ‌న డిఫ‌రెంట్ కంటెంట్‌తో చిత్రాలు తెరకెక్కించారు. అయితే గత కొద్ది కాలంగా సరైన హిట్ లేకుండా వస్తున్న ఈయనకు ఇస్మార్ట్ శంకర్ సినిమా తో భారీ హిట్ కొట్టాడు. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాని కరొన్ జోహార్, ఛార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసున్న ఈ సినిమా త్వరలోనే రిల్లిజ్ చేసేందౌకు మేకర్స్ రెడీ అవుతున్నారు. బాక్సింగ్ నేపద్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉండగా అతి త్వ‌ర‌లో డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జ‌రుగుతుంది.

కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పలు క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ స్టార్ హీరో కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. సల్మాన్‌ కోసం పూరి తన స్టయిల్లో ఓ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశారని ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ఇక ఇప్పటికే పూరి హిందీలో అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా హోగా తేరా బాప్‌’ సినిమాను హిందీలో తీసిన విషయం తెలిసిందే . ఇక సల్మాన్ ఖాన్ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమాని హిందీలో వాంటెడ్ సినిమాగా రీమేక్ చేశారు. అక్కడ ఈ సినిమా సల్మాన్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. దీనితో మళ్లీ వీరిద్దరి మధ్య కంబినేషన్ సెట్ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news