Moviesబాధ‌లో ఉన్నా త‌మ్ముడు అఖిల్ కోసం చైతు ఏం చేస్తున్నాడంటే..!

బాధ‌లో ఉన్నా త‌మ్ముడు అఖిల్ కోసం చైతు ఏం చేస్తున్నాడంటే..!

అక్కినేని వార‌సులు ఇద్ద‌రూ ఇబ్బందుల్లోనే ఉన్నారు. నాగార్జున పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య తాజాగా స్టార్ హీరోయిన్ స‌మంత‌కు విడాకులు ఇచ్చారు. ప్ర‌స్తుతం చైతు ఈ బాధ‌లో ఉన్నాడు. ఇక రెండో కుమారుడు అఖిల్ నాలుగైదేళ్ల క్రితం కెరీర్ ఆరంభించినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టంటే ఒక్క హిట్ కూడా లేదు. ప్ర‌స్తుతం అఖిల్ ఆశ‌లు అన్నీ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ మీదే ఉన్నాయి.

ఎప్పుడో యేడాది క్రితం రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్‌కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక ఈ సినిమాపై ఉన్న బ‌జ్ నేప‌థ్యంలో ప్రి రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 8వ తేదీన ఈ ప్రోగ్రామ్ జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి గెస్ట్‌గా అఖిల్ అన్న చైతును ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

చైతు ప్ర‌స్తుతం స‌మంత‌తో విడాకుల వ‌ల్ల డిస్ట‌ర్బ్‌గా ఉన్నా కూడా ఇటు త‌మ్ముడుకు తొలి హిట్ కోసం తాను సైతం రంగంలోకి దిగాడంటున్నారు. ఇటీవ‌లే చైతు ఖాతాలో ల‌వ్‌స్టోరీ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కూడా ప‌డింది. ఇక ఇప్పుడు అఖిల్‌కు చైతు ప్ర‌మోష‌న్ ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది ? ఈ సినిమాతో అయినా మ‌నోడు హిట్ కొడ‌తాడా ? అన్న‌ది తెలియాలంటే ఈ నెల 15 వ‌ర‌కు ఆగాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news