Moviesవామ్మో....రొమాంటిక్‌ మూవీపై ఆ డైరెక్టర్ ఇంత హాట్ కామెంట్స్ నా..అసలు ఊహించలేదుగా..!!

వామ్మో….రొమాంటిక్‌ మూవీపై ఆ డైరెక్టర్ ఇంత హాట్ కామెంట్స్ నా..అసలు ఊహించలేదుగా..!!

పూరీజగన్నాథ్ తనయుడిగా పరిచయం అయ్యాడు ఆకాష్ పూరి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు. ఇప్పుడు హీరోగా మరి సినిమాలు చేస్తున్నాడు. ఆకాష్ నటించిన మెహబూబా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి సిద్ధం అయ్యాడు ఆకాష్. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్.


ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో హీరోయిన్ లుగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. అనిల్ పాడూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా మూవీ ప్రీమియర్‌ షోను నిర్వహించారు. ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ఫోకు టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై సినిమాను వీక్షించారు. వీరిలో టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి కూడా ఉండడం గమనార్హం.

ఇక రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. సినిమాని ఓ రేంజ్ లో పొగిడేసారు. ముఖ్యంగా హీరో పూరీజగన్నాథ్ కొడుకు గురించి మాట్లాడిన మాటలు అందరిని అటృఆక్ట్ చేస్తున్నాయి. సినిమా చూదాను అని అద్భుతంగా ఉందని.. ఈ సినిమా గురించి ఏదైనా వంక పెడితే ముసలోడివై పోయావ్‌…నీకెం తెలుసు అంటారేమోనని భయంగా ఉందన్నడు రాజమౌళి. తన మనసులో ఏదనిపిస్తే అలానే అనిల్‌ అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు..అంటూ ఆకాశ్‌, కేతికల రూపంలో డైరెక్టర్‌కు అద్భుతమైన జోడీ దొరికింది. ఇక ఆకాశ్ ముఖ్యంగా క్లైమాక్స్‌లో తను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ బాగా ఆకట్టుకుంది. మన సినిమా ఇండస్ట్రీకి మరో అద్భుతమైన నటుడు దొరికాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

#ssrajamouli at #Romantic Special Premiere. Talks about the film.#RomanticOnOCT29th pic.twitter.com/tdORbZtdPc

— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 28, 2021

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news