MoviesBigg Boss 5:ఆ స్ట్రాంగ్ కంటెస్టేంట్ కు పెరుగుతున్న మద్దతు..అతనికే ఓటేయండి...

Bigg Boss 5:ఆ స్ట్రాంగ్ కంటెస్టేంట్ కు పెరుగుతున్న మద్దతు..అతనికే ఓటేయండి అంటూ రిక్వెస్ట్..!!

అబ్బో..ఇప్పుడు ఏవరి నోట విన్న ఒకటే మాట. బిగ్ బాస్.. బిగ్ బాస్. మొదట్లో హౌస్ ఫుల్ గా కనిపించిన ఈ హౌస్..ఇప్పుడు ప్రతివారం కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ బోసిపోతున్నాయి. 19 మందితో కళకళలాడిపోయిన బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం 13 మంది మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు ఏడుగురు వెళ్లిపోగా అందులో ఆరుగురు ఆడవాళ్లే కావడం గమనార్హం. ఇక ఈ వారం ఒకరిని పంపించేందుకు రంగం సిద్ధమైంది.

తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకునేందుకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈపాటికే ప్రచారానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఓ కంటెస్టెంట్‌ కోసం ఏకంగా టాలీవుడ్‌ హీరోయిన్‌ రంగంలోకి దిగి..తన ఫ్రెండ్‌కు ఓటేయమంటూ జనాలను అభ్యర్థిస్తోన్న సంగతి తెలిసిందే ఆమె పాయల్ రాజ్ పుత్. సింగర్‌ శ్రీరామ్‌కు తను సపోర్ట్‌ చేస్తున్నట్లు చెప్పింది పాయల్‌ రాజ్‌పుత్‌.

‘నా ఫ్రెండ్‌ శ్రీరామచంద్ర తెలుగు బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్నాడు. అతడికి ఇదే నా బెస్ట్‌ విషెస్‌.. దయచేసి అందరూ శ్రీరామ్‌కే ఓటేయండి’ అని చెప్పుకొచ్చింది భారతీ సింగ్ . ఈ వీడియో చూసిన శ్రీరామ్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మొన్నటివరకు ఓ రేంజ్‌లో ఆడి రెచ్చిపోయిన శ్రీరామ్‌..హమీద ఎలిమినేట్ అయ్యాక ఎందుకో కాస్త.. కాస్త డల్‌ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు టైటిల్‌ను గెలుచుకునే టాప్ 5 కంటెస్టెంట్స్ లో పాపులర్ సింగర్, నటుడు శ్రీరామ చంద్ర కూడా ఒకరు. శ్రీరామ్‌కు సోషల్ మీడియాలో, మొబైల్ ఓటింగ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్న ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది.

Latest news