MoviesMAA Elections: తెర పై కొత్త బాంబ్ పేల్చిన యంగ్ బ్యూటీ..!!

MAA Elections: తెర పై కొత్త బాంబ్ పేల్చిన యంగ్ బ్యూటీ..!!

ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(MAA) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు జరగనుండగా..ఒక పక్క ప్రకాష్ రాజ్, మరొక పక్క మంచు విష్ణు లు మా అధ్యక్ష పదవి కోసం, మా అసోసియేష్ లో సమస్యల పరిష్కారం కోసం పోటీ చేస్తున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ప్రధానం గా వీరి మధ్యన గట్టి పోటీ ఉందని చెప్పాలి.

అయితే తాజాగా ఓ యంగ్ బ్యూటీ మా ఎన్నికల్లోనూ వేలు పెట్టేసింది. అసలే మా ఎన్నికల్లో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్న తరుణంలో పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పూనమ్ కౌర్.. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువగా కాంట్రవర్సీలతో వార్తల్లో ఉండే హీరోయిన్. గత రెండు మూడు రోజులుగా పోసాని కామెంట్స్ తో పూనమ్ కౌర్ వార్తల్లో నిలుస్తూనే ఉన్మ్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా మా ఎన్నికల ప్రచారంలోకి పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చింది. ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రకాశ్ రాజ్‌తో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ మా ఎన్నికల్లో ఆయనే గెలవాలి అని కోరుకుంటున్నాను అని మనసులోని మాట బయటపెట్టారు. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. మరి చూడాలి ప్రకాశ్ రాజ్ గెలిస్తే ఈ యంగ్ బ్యూటీ తెర పై ఏం కొత్త బాంబ్ పేల్చుతుందో..??

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news