Moviesఆ రోజు బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలే.."పుష్ప" రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..!!

ఆ రోజు బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలే..”పుష్ప” రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..!!

సుకుమార్ రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ వర్క్ చేస్తున్న సినిమా పుష్ప. ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆర్య‌, ఆర్య 2 త‌ర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ముదటి సారి అల్లు అర్జున్ కు జంటగా..రష్మిక మందన నటిస్తుంది.

సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. తాజాగా పుష్ప చిత్రం నుండి ర‌ష్మిక ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. భయంకరమైన ‘పుష్ప’రాజ్ లవర్ శ్రీవల్లిని పరిచయం చేశారు. శ్రీ వ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక డీ గ్లామ‌ర్ లుక్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ఈ సినిమాలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ర‌ష్మీక గిరిజ‌న అమ్మాయిగా కనిపించబోతుంది. ఇక బ‌న్నీ కూడా అదే తరహాలో ఆమెను ప్రేమించే గిరిజ‌న యువ‌కుడి గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అందుకే ఈ సినిమా కోసం చిత్తూరు యాస‌ను చాలా క‌ష్ట‌ప‌డి మ‌రీ నేర్చుకున్నాడ‌ని తెలుస్తోంది. మాస్ లుక్‌లో వెండితెరపై బన్నీని చూడాలని కుతూహల పడుతున్నారు.

ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న పుష్ప సినిమా రిలీజ్ డేఅట్ ను చిత్ర బృందం అదికారికంగా ప్రకటించింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప‌’ రిలీజ్ డేట్ విష‌యంలో చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిచింది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా సినిమాను డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలియజేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ఓ పాట‌ను కూడా విడుద‌ల చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమాలో అల్లు అర్జున్ ర‌గ్డ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news