Moviesడైరెక్టర్ తేజ కొడుకు ఆ సినిమాలో నటించాడనే విషయం మీకు తెలుసా..?

డైరెక్టర్ తేజ కొడుకు ఆ సినిమాలో నటించాడనే విషయం మీకు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే ట్రెండ్ సృష్టించిన దర్శకుడు తేజ.తెలుగు చిత్ర పరిశ్రమలో వెరైటీ కథనాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డైరెక్టర్ తేజ. మొదట లైటింగ్ అండ్ సౌండ్ డిపార్టమెంట్ లో పనిచేసి..ఆ తర్వాత కెమెరా డిపార్డ్ మెంట్ లో కొద్దికాలం పనిచేశాడు. హిందీ, తెలుగు ఇండస్టీలో కెమెరా మెన్ గా పలుచిత్రాలకు పని చేసాడు.రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి శివ సినిమాకు పోస్టర్ లోగోను తయారు చేసి రామ్ గోపాల్ వర్మ అభిమానాన్ని సంపాదించాడు.

కెమెరా మెన్ గా సక్సెస్ కొట్టిన తేజ దర్శకుడి గా తీసిన మొదటి సినిమా ‘చిత్రం’. రామోజీ రావు ప్రొడ్యుసర్ గా వచ్చిన ఈ సినిమా కొత్త నటీనటులతో, తక్కువ బడ్జెట్ లో తయారై సూపర్ హిట్ కొట్టింది. తన సినిమాల ద్వారా తేజ ఎంతో మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ముక్కుసూటిగా మాట్లాడే తనం.. నిజాలు దైర్యంగా చెప్పే గుణం.. డైరెక్టర్ తేజకు చాలా ప్లస్ అయ్యాయి. ఇక థియేటర్ కు వచ్చిన ప్రతీ ప్రేక్షకుడు దగ్గర..ప్రతి సీన్ కు ప్రేక్షకుల చేత కొట్టించడం ఆయన స్పెషాలిటీ.

టాలీవుడ్ కి ఆయన ఎందరో హీరో..హీరోయిన్ లను పరిచయం చేసాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు.ఇక బయట ప్రపంచానికి తెలిసి తేజకు ఒక కూతురు ఒక కొడుకు. కానీ వాస్తవానికి ఇంకొక కొడుకు కూడా ఉండేవాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతో నాలుగేళ్ళ వయసులోనే నూరేళ్లు నిండిపోయాయి. ఇకపోతే తేజ పెద్దకొడుకు అమితోవ్ 2000 సంవత్సరంలో చిత్రం సినిమాలో అతిథి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కానీ ఈ విషయం చాలా తక్కువమందికి తెలుసు.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news