Moviesదట్ ఇజ్ బాలయ్య..ఈ ఒక్క విషయం చాలదా ఆయన ఎలాంటి వారు...

దట్ ఇజ్ బాలయ్య..ఈ ఒక్క విషయం చాలదా ఆయన ఎలాంటి వారు అని చెప్పడానికి..?

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరుకు  పరిచయం అవసరం లేదు. తన నటనతో..ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న నందమూరి వారసుడు. తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి హీరో నందమూరి బాలకృష్ణ.. నందమూరి నట వారసత్వాని అందిపుచ్చుకుని..టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించారు. బాలకృష్ణ గురించి మనందరి కి తెలిసిందే..ఆయనకు కోపం ఎక్కువని..ఉన్నది మొదానే మాట్లాడేస్తారని..మనసులో ఒక్కటి పెట్టుకుని.. బయటకి ఒకటి చెప్పడం..చేయడం ఆయనకు చేత కాదని మనకు తెలిసిందే.

ఎదుట ఉన్నది ఎవరైనా సరే.. ఎంత పెద్ద వ్యక్తయినా సరే..భయం వణుకు లేకుండా.. తప్పు చేస్తే ఎవరిని వదలడు బాలయ్య…తప్పు చేసిన వాళ్లకి ఉగ్రరూపం చూపిస్తారు. ముక్కుసూటిగా మరియు కుండా బద్దలు కొట్టినట్లుగా మాట్లాడడం తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య బాబు తరువాతే ఎవరైనా. ఆయనంటే ఇండస్ట్రీలో చాలామందికి భయం. బాలకృషణ కి కోపమే కాదు జాలి కూడా ఎక్కువే. ఎవరైన ఆపదలో ఉన్నారంటే చాలు వాళ్లకి ఖచ్చితంగా సహాయం చేస్తారు.

తాజాగా అలాంటి ఇన్సిడెంట్ ఒకటి ఎదురైంది. బాలకృష్ణ” బసవతారకం” అని హాస్పిటల్ ద్వారా ఎంతోమంది రోగుల ప్రాణాలను కాపాడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో మల్కాజ్ గిరికి చెందిన మణిశ్రీ అనే ఒక చిన్న పాప.. క్యాన్సర్ వ్యాధితో హాస్పిటల్ లోకి చేరింది. ఆ పాప ఆపరేషన్ కోసం మొత్తం 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఆ చిన్నారి తల్లిదండ్రులు పేద వారు అవ్వడంతో..అంత డబ్బులు పెట్టుకోలేరు. దీంతో వాళ్ల తల్లిదండ్రులు దాతలతో కొంత డబ్బును సేకరించారు. కానీ వారికి ఇంకా 5 లక్షల రూపయలు కావాలి.

ఏం చేయ్యల్లో దిక్కు తోచని స్థితిలో బాలకృష్ణ అభిమాని సంఘం అధ్యక్షుడిని కలిశారు. దీంతో బాలకృష్ణ వారు కట్టవలసిన 5 లక్షల 20 వేల రూపాయలు మాఫీ చేయించారు. అంతేకాకుండా ఆ చిన్నారి బాగోగులను కూడా చూడమని హాస్పిటల్ వారికి తెలియజేశాడు. దీంతో బాలయ్య మనసు ఎంత గొప్పదో తెలుసుకొండి అంటూ నందమూరి అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా తాజాగా మరొకసారి బాలకృష్ణ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news