Gossipsకీర్తి సురేష్ సంచలన నిర్ణయం ..అద్దె గర్భంకు రెడీ..?

కీర్తి సురేష్ సంచలన నిర్ణయం ..అద్దె గర్భంకు రెడీ..?

కీర్తి సురేష్‌.. ఈ పేరుకన్నా ఆమెకి మహానటి అనే పేరు నే కరెక్ట్ గా సెట్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ సినిమా విడుదలైయే వరకు ఆమె ఒక్క హీరోయిన్ గానే తెలుసు కానీ, ఆ సినిమా తరువాత ఆమె మహానటి సావిత్రి నే అయిపోయింది. అంతలా మనల్ని తన నటన తో ఆకట్టుకుంది ఈ కీర్తి పాప. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‌ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ఇక ఈ సినిమాతోనే ఆమెకు ఉత్తమ జాతీయ నటిగా పురస్కారం లభించింది.

కీర్తి సురేశ్‌ .. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్‌’, మహేశ్‌ బాబుతో ‘సర్కారు వారి పాట’, రజనీకాంత్ ‘అన్నాత్తే’ మొదలైన సినిమాతో కెరీర్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె ఓ ఛాలెంజింగ్ రోల్ లో కనిపిస్తున్నట్లు వారత్లు వినిపిస్తున్నాయి. అద్దె గర్భం థీమ్ తో దివంగత నటి సౌందర్య తొమ్మిది నెలలు సినిమాలో నటించిని విషయం గుర్తు ఉండేఉంటుంది కదా.. సేం అదే ఢీం లో బాలీవుడ్ లో ‘మిమి’ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ మూవీలో కృతిసనన్‌ కీలక పాత్రలో నటించగా లక్ష్మణ్‌ ఉత్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్దె గర్భంతో ఓ యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? వాటి నుంచి ఎలా బయటపడిందన్న ఇతివృత్తంతో మనిషి మదిని ఆకట్టుకునే విధంగా భావోద్వేగభరితంగా ఈ సినిమా సాగుతుంది. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగు, తమిళ భాషలో నిర్మించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ ట్రై చేస్తుండట. ఇక ఈ సినిమాలో కీర్తి సురెష్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను రీమేక్ చేయాలనీ భావిస్తున్న నిర్మాణ సంస్థ కృతిసనన్ పాత్రలో కీర్తి సురేష్ కోసం సంప్రదిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news