Movies2నిమిషాల కోసం 70 లక్షలు డిమాండ్ చేస్తున్న స్టార్ హీరో.. ఎందుకో...

2నిమిషాల కోసం 70 లక్షలు డిమాండ్ చేస్తున్న స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..??

జనరల్ గా హీరో హీరోయిన్ లు సినిమాలతో పాటు..పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా..పలు యాడ్ లు చేస్తుంటారు. దీనిగాను వాళ్ళు పారితోషకం కూడా బాగానే పుచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఓ బడా హీరో మాత్రం ..ఏకంగా 70 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. అది కూడా కేవలం 2 నిమిషాల యాడ్ కోసమే. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి ఆ హీరో ఎవరో తెలుసా..?? బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే వౌతుంది. సల్మాన్ సినిమా ధియేటర్స్ లో వస్తుందంటే ఆ రోజు అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసిన ఈయన యాడ్ లు కూడా నటిస్తుంటారు. పారితోషకం కూడా బాగానే పుచ్చుకుంటారులేండి. ఇక సల్మాన్ ఖాన్ సినిమాలకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటాడన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు యాడ్ లకు కూడా భారీగా పారితోషకాని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

 

బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం మంకు తెలిసిందే. సినిమాల్లో అలరిస్తూనే బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు షారుక్. షారుక్ ఓటీటీలోకి అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే ఓ ప్రముఖ సంస్థ షారుక్ ఎంట్రీని కన్ఫామ్ చేసింది. అయితే షారుక్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వడం కోసం సల్మాన్‌ను రంగంలోకి దింపిందట ఆ సంస్థ. షారుక్ ఎంట్రీని ఖరారు చేస్తూ సల్మాన్ ఓ ఓటీటీ యాడ్‌లో నటించబోతున్నారు. అయితే ఇందుకోసం సల్మాన్ భారీగా రెమ్యునరేషన్ అందుకోనున్నాడని తెలుస్తుంది. కేవలం కొన్ని నిమిషాల యాడ్ కోసమే సల్మాన్‌కి 70 లక్షలు పారితోషికం ఇస్తున్నారుట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news