Moviesకళ్ళు చెదిరే డీల్ తో “శ్యామ్ సింగ రాయ్” డబ్బింగ్ రైట్స్...

కళ్ళు చెదిరే డీల్ తో “శ్యామ్ సింగ రాయ్” డబ్బింగ్ రైట్స్ క్లోజ్..!!

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో దీనిపై మంచి క్రేజ్ ఏర్పడింది. దీనికి కారణం సినిమా టైటిల్. ‘శ్యామ్ సింగ రాయ్’ అనే వినూత్నమైన టైటిల్ పెట్టడమే కారణం.

ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. సాయి పల్లవి, కృతి శెట్టిలతో పాటు మరో టాలెంటెడ్ నటుడు నటిస్తున్నాడు. బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. నాని ఫిల్మ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం “శ్యామ్ సింగ రాయ్” డబ్బింగ్ రైట్స్ డీల్ రికార్డు ధరకు క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను భ్4ఊ దక్కించుకుంది. మరోవైపు ‘శ్యామ్ సింగ రాయ్’ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. సత్యదేవ్ జంగా రచించిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.సను జాన్ వర్గీస్, నవీన్ నూలి వరుసగా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి స‌త్యదేవ్ జంగా క‌థ‌ను స‌మ‌కూర్చగా, మెలోడీ సాంగ్స్ స్పెష‌లిస్ట్ మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news