Moviesమళ్లీ ప్రేమలో పడ్డ రామ్ చరణ్.. కొత్త లవ్ ఎవరో తెలుసా..?

మళ్లీ ప్రేమలో పడ్డ రామ్ చరణ్.. కొత్త లవ్ ఎవరో తెలుసా..?

ఏంటి రామ్ చరణ్ మళ్లి ప్రేమలో పడ్డడా..?? మరి ఉపాసన పరిస్దితి ఏంటి..?? అని షాక్ అవుతున్నారా..?? అలాంటిది ఏమి లేదండి. చరణ్ ఉపాసన హ్యాపీగా కలిసే ఉన్నారు. ఎప్పటికి ఇలాగే కలిసి ఉండాలి కోరుకుందాం కూడా. అయితే , మధ్యలో చరణ్ ఉపాసాన మధ్యలోకి వచ్చినా ఈ కొత్త లవ్ ఏవ్రు అనుకుంటున్నారా..?? దాని పేరే రైమ్. యస్.. రైమ్.. ఇది ఓ కుక్క పిల్ల. చుడడానికి ముద్దు ముద్దు గా క్యూట్ గా ఉండే ఈ కుక్క పిల్లని తాజాగా చరణ్ తన అభిమానులకి పరిచయం చేసాడు.

సాధార‌ణంగా చాలా మంది సెల‌బ్రిటీలు వాళ్ళ ఇళ్ల‌ల్లో క్యూట్ కుక్క పిల్లలు మ‌న‌కు ద‌ర్శ‌నం ఇస్తుంటాయి. వాటిని ఎంతో మురిపెంగా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. అంతేనా ఆ పప్పీకి సంబంధించిన ఫొటోలను సోష‌ల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా త‌న ఇంట్లోని కొత్త కుక్క పిల్ల‌ను ప‌రిచ‌యం చేశాడు. దానికి రైమ్ అనే పేరు పెట్టిన చ‌ర‌ణ్ ప‌ప్పీతో దిగిన ఫొటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోస్ చూసిన అభిమానులు రక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

ఇటీవల కాలంలో సెలెబ్రిటీలంతా మూగజీవాల ప్రేమలో పడిపోయారు. సామ్, రష్మిక, కీర్తి సురేష్ తన కుక్కపిల్లను సోషల్ మీడియాలో ఇప్పటికే పరిచయం చేశారు. ఇప్పుడు చరణ్ కూడా తన కొత్త కుక్క పిల్లను పరిచయం చేయడం విశేషం. ఇక చరం సినిమాల విష్యానికి వస్తే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసిన చ‌ర‌ణ్‌.. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉ్న‌నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబరు నుంచి ప్రారంభం కానుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news