Moviesమహేష్ బాబు సెల్ఫీ తీసుకోవాలంటే ఎవరితో తీసుకుంటాడో తెలుసా..??

మహేష్ బాబు సెల్ఫీ తీసుకోవాలంటే ఎవరితో తీసుకుంటాడో తెలుసా..??

మహేష్ బాబు గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ఆయనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఎటువంటి గొడవలకు పోకుండా..ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా.. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు ఈ ఘట్టమనేని వారసుడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా… ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు .. మొహంపై ఎప్పుడు చిరునవ్వుతో ఎంతోమందిని అట్రాక్ట్ చేస్తుంటారు. వయసు పెరిగే కొద్ది అందం పెరుగుతుంది కానీ తరగదు..మరీ ఆయన అమదం సీక్రేట్ ఏంటో ఎవరికి తెలియని చిదంబర రహస్యం లానే ఉండిపోతుంది.

ఇక మనకు తెలిసిందే మహేష్ బాబు సినిమాలతో పాటు పలు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో కూడా న‌టిస్తూ ఉంటారు. ఇప్పటికే పలు బడా కంపెనీలకు ఇర‌వైకి పైగా క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌ చేస్తూ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా న‌టిస్తున్న మ‌హేష్ బాబు రీసెంట్‌గా ప్ర‌ముఖ మొబైల్ విక్ర‌య సంస్థ బిగ్ సికు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సెలక్ట్ అయ్యారు.

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో 250 స్టోర్లు ఉండగా.. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా చేసుకున్నామని ఆ సంస్థ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సిఎండి) ఎం బాలు చౌదరీ తెలిపారు. సంస్థ బ్రాండ్‌ అంబాసీడర్‌గా ప్రముఖ హీరో మహేష్‌ బాబును నియమించుకుంది. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేయబోయే 250 స్టోర్ల కోసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నామని వెల్లడించారు.

ఇక దీనికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ యాక్టివిటీలో మ‌హేశ్ పాల్గొన్నారు. రీసెంట్‌గా బిగ్‌సికి సంబంధించిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ‌హేష్ బాబు విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే మీరు ఉప‌యోగించిన తొలి మొబైల్ ఫోన్ మోడ‌ల్ ఏంటి? అని ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు ‘నోకియా క్లాసికల్ మోడల్’ అని సమాధానం ఇచ్చారు. అలాగే మీరు సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటే ఎవ‌రితో తీసుకోవాల‌నుకుంటారు? అనే ప్ర‌శ్న‌కు వెంట‌నే మా నాన్న అని ఆన్సర్ చేసారు మ‌హేష్ బాబు.

Latest news