Moviesలీకైన మహేష్ బాబు షూట్ వీడియో..నెట్టింట వైరల్..!!

లీకైన మహేష్ బాబు షూట్ వీడియో..నెట్టింట వైరల్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు..ఈ ఆరు అడుగుల అందగాడు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరో అయిన ఈ ఆరు అడుగుల అందగాడికి అంతులేని ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక దక్షణాది సినీ పరిశ్రమలో ఘట్టమనేని మహేష్ బాబు పేరుకో బ్రాండ్ ఉంది. అందుకే ఆయనను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకొనేందుకు ఎన్నో కార్పొరేట్ కంపెనీలు వెంటపడుతుంటాయి.

ఇప్పటికే థమ్స్‌ అప్ యాడ్‌లో మహేష్ నటించిన విషయం తెలిసిందే. ఇంకా చాలా యాడ్స్‌లో నటించిన మహేష్ ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి ఓ యాడ్ చేశారు. ఇప్పుడు పాన్ బహార్ ఇలాచీ కోసం మరో యాడ్‌లో నటిస్తున్నారు మహేష్. ఇప్పటికే మహేష్ చాలా కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిదే. మహేష్ ఇప్పటికే బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఓ ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు మరో యంగ్ హీరోతో కలిసి స్క్రీన్ చేసుకుంటున్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో మహేష్ బాబు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. మహేష్- టైగర్ ష్రాఫ్ పై ‘పాన్ బహార్ ఇలాచీ’ యాడ్‌ కోసం షూట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీదియాలో లీక్ అవ్వడంతో..అవి నెట్టింత వైరల్ గా మారాయి. బాలీవుడ్ యంగ్ హీరోలలో కండల వీరుడిగా పేరున్న టైగర్ ష్రాఫ్ ఇప్పుడిప్పుడే భారీ ఫాలోయింగ్ తో పాటు బాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకుంటుండగా ఇదే సమయంలో ప్రకటనలో కూడా బిజీబిజీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news