Moviesసీనియ‌ర్ న‌టుడు రాళ్ల‌ప‌ల్లి సినీ ఎంట్రీకి ఆమే కార‌ణ‌మా ?

సీనియ‌ర్ న‌టుడు రాళ్ల‌ప‌ల్లి సినీ ఎంట్రీకి ఆమే కార‌ణ‌మా ?

రాళ్లపల్లి అనగానే మొదట ఒక విలక్షణ నటుడు గుర్తుకొస్తాడు. ఈయన ఒకసారి ఒక పాత్రలో నటిస్తున్నాడు అంటే , ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు ప్రాణం పోస్తారు. అంతలా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. ఇకపోతే ఈయన 1945 ఆగస్టు 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాచపల్లి లో పుట్టారు. బీకాం పూర్తి చేసిన ఈయన ..టెన్త్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తోనే రైల్వేలో క్లాస్ ఫోర్ జాబ్ ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత 1977 సంవత్సర ప్రారంభంలో ఢిల్లీలో ఉన్న సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అనే ఒక ప్రభుత్వ సంస్థకు మారడం జరిగింది.

ఇందులో అప్పటికే ఎంతో అనుభవం అలాగే నాటక రంగం నుంచి వెండితెర మీద ఎక్కువ కాలం ఒక వెలుగు వెలిగిన నటులు ఉండడం గమనార్హం. ఇక రాళ్ళపల్లి కూడా ఎన్నో నాటకాలు వేసి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.. ఈయనకు ఒక ప్రత్యేకమైన పేరు తీసుకు వచ్చిన నాటకం ఏదైనా ఉందంటే అది కన్యాశుల్కం మాత్రమే. కాలేజీ లో ఉన్నప్పుడే మారని సంసారం ఒక నాటికకు రచన, నటన అన్నీ ఆయనే చేయడంతో ఈ రెండు విభాగాల్లో కూడా రాళ్లపల్లికి నంది అవార్డు లభించింది.

ఇకపోతే భార్య సహకారంతోనే సినిమాల్లోకి వచ్చారు రాళ్ళపల్లి. ఒక సారి ప్రముఖ నవల ఆధారంగా ఒక సినిమా తీస్తున్నట్లు పత్రికలో ఒక ప్రకటన రావడంతో ఇది చూసిన రాళ్ళపల్లి భార్య, సినిమాలపై ఆయన కున్న ఆసక్తిని చూసి ఆమె స్వయంగా దరఖాస్తు చేయాలని సపోర్ట్ చేశారట. అందంగా లేకపోయినా నాటక రంగంలో అనుభవం ఉంది కాబట్టి ఒక సారి ట్రై చేసి చూడండి.. అని చెప్పడంతో రాళ్ళపల్లి దరఖాస్తు చేసుకున్నార‌ట‌.

ఇది చూసిన దర్శకనిర్మాతలు ఆయనను ఇంటర్వ్యూ పిలవడం, అక్కడే ఆయన ఒక నాటకాన్ని ప్రదర్శించడంతో వెంటనే సినిమా లోకి తీసుకున్నారు..ఇలా ఎన్నో సినిమాలలో నటించి, ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు రాళ్ళపల్లి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news