Movies"పుష్ప"కు ఢబుల్ షాక్..ఊహించని ఎదురు దెబ్బలు..!!

“పుష్ప”కు ఢబుల్ షాక్..ఊహించని ఎదురు దెబ్బలు..!!

ప్ర‌స్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే సుక్కు అదేనండి లెక్కల డైరెక్టర్ సుకుమార్ కూడా రంగ‌స్థ‌లం లాంటి యునాన‌మ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని పుష్ప మీదే బాగా వ‌ర్క్ చేస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆర్య‌, ఆర్య 2 త‌ర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాలో మొదటి సారి అల్లు అర్జున్ కు జంటగా..రష్మిక మందన నటిస్తుంది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ఈ సినిమాలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ర‌ష్మీక గిరిజ‌న అమ్మాయిగా కనిపించబోతుంది. ఇక బ‌న్నీ కూడా అదే తరహాలో ఆమెను ప్రేమించే గిరిజ‌న యువ‌కుడి గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అందుకే ఈ సినిమా కోసం చిత్తూరు యాస‌ను చాలా క‌ష్ట‌ప‌డి మ‌రీ నేర్చుకున్నాడ‌ని తెలుస్తోంది. మాస్ లుక్‌లో వెండితెరపై బన్నీని చూడాలని కుతూహల పడుతున్నారు.

అయితే ఈ సినిమాకు ఒకదాని తరువాత ఒకటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడు సుకుమార్ తో పాటు పలువురు చిత్రబృందం కూడా జ్వరాల బారిన పడ్డిన విషయం తెలిసిందే. దీంతో సినిమాకు అనుకోకుండా కొన్ని రోజులు బ్రేక్ వేయాల్సి వచ్చింది. జ్వరం నుంచి కోలుకున్న తరువాత మళ్ళీ “పుష్ప” షూటింగ్ ప్రారంభించారు. అయితే మళ్ళీ సినిమాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అదేమిటంటే.. “పుష్ప” చివరి షెడ్యూల్ మారేడుమిల్లి ఫారెస్ట్‌లో జరగాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీంతో పుష్ప టీం డిస్సపాయింట్ మేంట్ లో ఉంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news