Moviesచిరంజీవి గురించి ఈ షాకింగ్ విషయం మీకు తెలుసా..?

చిరంజీవి గురించి ఈ షాకింగ్ విషయం మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా కొంతమంది ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం కొంతమంది సినీ పెద్దలు మాత్రం సినీ ఇండస్ట్రీలోని కార్మికులకు, ప్రజలకు కూడా తమ వంతు సహాయం చేస్తూ వస్తున్న ఏకైక వ్యక్తి చిరంజీవి అని చెప్పవచ్చు. ఇక ఈయన మన మధ్య కరోనా సమయంలో ఎంతో మందికి , ఎన్నో రకాలుగా సహాయపడుతున్న విషయం తెలిసిందే.

ఇక మెగాస్టార్ చిరంజీవి తను సంపాదించిన మొత్తం లో రోజుకు ఎంత దానం చేస్తున్నారు అనే విషయంపై ఆరా తీయగా..షాకింగ్ నిజాలు బయటపడిన్నట్లు తెలుస్తుంది. ఇక ఆయన ఇంటికి ఎవరైనా ఆర్థిక సహాయం కావాలంటూ వస్తే లేదు అనకుండా వారికి వీలైనంత సహాయం చేస్తున్నారు. అంతేకాదు వారి పరిస్థితిని బట్టి చెక్ రాశి ఇస్తూ ఉంటారట అంతేకాదు ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం ఆయన చాలామందికి నిత్యావసర సరుకులను పంపిస్తూనే, రోజుకు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు చెక్ రూపంలో ఇస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఏది ఏమైనా ఒక వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో దానం చేయడం అంటే అది ఎంత పెద్ద గొప్పతనమో మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత చేస్తున్నప్పటికీ చిరంజీవి ఒక సాదాసీదా మనిషిగా జీవించడం అంటే ఆయన లో ఉన్న మంచితనానికి ఇది అద్దం పడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news