MoviesBigg Boss 5: మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్న ఆ కంటెస్టెంట్...

Bigg Boss 5: మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్న ఆ కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 5 కలర్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది. హోస్ట్ నాగార్జున ‘టన్నుల కొద్దీ కిక్’ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి.. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్‏బాస్ హౌస్ లో పెట్టి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. ఇక చుడండి ఆ కంటెస్టెంట్స్ రచ్చ మాములుగా లేదు. ఎవరికి వాళ్ళు నటించడం లేదు జీవించేస్తున్నారు. మున్నటి వరకు వరకు కంటెస్టెంట్లు ఎవరా అనే అనుమానాల ప్రచారం నుండి ఇప్పుడు ఏ కంటెస్టెంట్లు ఎప్పుడు గొడవ పడతారు. ఎప్పుడు ఎవరు లవ్ ట్రాక్ నడుపుతారు అని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

ఇక హౌస్ లోని కంటెస్టెంట్స్ విషయానికి వస్తే..వచ్చిన మొదటి రోజు నుంచే వార్ మొదలెట్టేశారు.. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకునే స్టేజ్‌కి వెళ్లి పోయారు. జెస్సీ మీద యానీ మాస్టర్ ఫైర్ అవ్వడం.. ఎందుకంత ఫైర్ అవుతున్నవని కాజల్‌ను లహరి చీవాట్లు పెట్టడం చూస్తుంటే మున్ముందు.. ఈ గొడవలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అందరికి అందరు ఎవరిని తీసిపారేయాల్సిన పని లేకుండా..స్క్రీన్ షేర్ కోసం కంటెంట్ లు బాగానే క్రియేట్ చేసుకుంటున్నారు.

గొడవ పెట్టుకుంటే ఎక్కువ వారాలు హౌస్ లో ఉంటారనో..లేక ప్రోమోలో పడతారనో తెలియదు కానీ..అవసరం ఉన్న లేకున్న అడిగి మరీ గోడవ పడుతున్నారు కొందరు కంటెస్టెంట్స్. ఇక కొందరు అయితే మాకెందుకులే అని పక్కన వాళ్ళు గొడవ పడుతున్న తమ పని తాము చేసుకుని వెళ్లిపోతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నాలుగు మాటలు..ఆరు గొడవలు లాగా సాగిపోతున్నాయి.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేస్తూ..బయట ఉన్న వాళ్ల ఫ్యాన్స్ వాళ్లకు తగ్గ రీతిలో ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ఆధారంగా..సోషల్ మీడియాలో తెలుస్తున్న సపోర్ట్ బట్టి..టాప్ ప్లేస్ లో ఉన్నాడు యుట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్. ఆ తరువాత యాంకర్ రవి..ఆ తరువాత ట్రాన్స్ జెండర్ ప్రియాంకా ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు కూడా ప్రుయాంక కు తన మద్దతును ప్రకటించినట్లు తెలుస్తోంది.ఇక ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఎంతో మంది ఉన్న నాగబాబు మాత్రం ప్రియాంక సింగ్ కె తన ఓటు అని చెప్పుకొచ్చారు.

ప్రియాంక అబ్బాయిగా ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్ అని.. ఎంతో కష్టపడి ఈ స్తాయికి వచ్చాడని అన్నారు. ప్రియాంక బిగ్‌బాస్‌కి వచ్చిందని తెలిసి చాలా సంతోషించానన్నారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా బిగ్‌బాస్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యాంకర్ రవి, యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ్, ప్రియ, నటరాజ్ మాస్టర్ ఇలా చాలా మంది పాల్గొన్నా.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్‌కే నా పూర్తి మద్దతు అని అంటున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news