Moviesషాకింగ్: సినీ ఇండస్ట్రీకి ఇక గుడ్ బై చెప్పనున్న యంగ్ హీరో..కారణం...

షాకింగ్: సినీ ఇండస్ట్రీకి ఇక గుడ్ బై చెప్పనున్న యంగ్ హీరో..కారణం ఏంటో తెలుసా..??

నిఖిల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు బాగా తెలిసిన వ్యక్తే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చాడు నిఖిల్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం చాలా కష్టం అని చెప్పి కొంతమంది ఫెయిల్యూర్ పీపుల్ లిస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా నిఖిల్‌ని చూసి నేర్చుకోవాలి. హ్యాపీడేస్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కూడా మొదట్లో మాస్ జపమే చేశాడు. నెక్ట్స్ టు రవితేజ అంటూ వరుస డిజాస్టర్స్ ఫేస్ చేశాడు.

కానీ ఒక సారి ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మాత్రం కుంగిపోకుండా తన కెరీర్ గురించి తాను నిజాయితీగా విశ్లేషించుకున్నాడు. తను వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదని తెలుసుకున్నాడు. కట్ చేస్తే స్వామిరారా సినిమా నుంచి మనవాడి హ్యాపీడేస్ స్టార్ట్ అయ్యాయి. స్వామిరారా, కార్తికేయ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన నిఖిల్ తాజా సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దెబ్బకు మనవాడికి గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయి. వద్దన్నా కూడా కోట్లాది రూపాయలు వచ్చి ఒళ్ళో పడుతున్నాయి.

కొత్తదనంతో ఉన్న కథల్నీ ఎంచుకుని విజయాలను అందుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆయన హీరోగా వచ్చిన స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ‘అర్జున్ సురువరం’ సినిమాలు విజయాన్ని పొందాయి. ఇప్పటి వరకు హీరోగా నిఖిల్ 17 సినిమాలు చేశారు.అయితే, త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు నిఖిల్ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది.దీంతో ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు.

నిఖిల్ ప్రస్తుతం ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా విడుదలైన తర్వాతే మరో సినిమాను ఒప్పుకుంటానని తెలిపాడు నిఖిల్. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..నిఖిల్ కి ఆరోగ్య పరిస్ధితి బాగోలేనందున..కొన్ని నెలలు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నారట. ఆ తరువాత కూడా ఆరోగ్యం కుదుట పడకపోతే..ఇక పూర్తిగా సినిమాలు ఆపేయాలి అని డిసైడ్ అయ్యారట. నిఖిల్ ఈ షాకింగ్ నిర్ణయంతో..అభిమానులు కలవరపడుతున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకుంటున్నారు. అయితే ఈ విషయం పై ఇప్పటి వరకు నిఖిల్ స్పందించకపోవడం గమనార్హం.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news