Moviesఆ ఒక్క నిర్ణయంతో ఈయన సినీ జీవితం సర్వ నాశనం అయిపోయింది..?

ఆ ఒక్క నిర్ణయంతో ఈయన సినీ జీవితం సర్వ నాశనం అయిపోయింది..?

భారత చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది మహానటులు దురదృష్టవశాత్తు మన మధ్య లేకపోయినప్పటికీ వారు వేసిన పాత్రలు మాత్రం చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో చిరస్తాయిగా నిలిచిపోయాయి. ఆ మహానటులు చేయలేని పాత్ర కానీ, వేయలేని వేషం కానీ ఏమీ మిగిలి ఉండలేదనే చెప్పవచ్చు. కామెడీ అయినా,సెంటిమెంట్ అయినా,విలన్ నిజమైన ఇలా నవరసాల్లో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే నటులు ఎంతోమంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. వారిలో ఒకరే ఆహుతిప్రసాద్ కూడా.

త‌న అద్భుత న‌ట‌న‌తో విశేషంగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న న‌టుడు ఆహుతి ప్ర‌సాద్‌. ముందు విల‌న్‌గా త‌ర్వాత పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించినా ఆయ‌న కామెడీ విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా క‌నిపించారు. ఆహుతి సినిమాలో చేసిన పాత్రతో ప్రసాద్ ఆహుతి ప్రసాద్ గా మారి ప్రేక్షకులను ఎన్నో సినిమాల్లో మెప్పిస్తూ వచ్చాడు. టాలీవుడ్ లో అగ్ర కథానాయకులలో ఒకడిగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున మొదటి చిత్రం “విక్రమ్” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆహుతిప్రసాద్, అసలు పేరు అడుసుమిల్లి జనార్దన్ వరప్రసాద్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హాస్యనటుడుగా 300 పైగా సినిమాల్లో నటించారు.

1990 సంవత్సరంలో పోలీస్ భార్య సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న ఆహుతిప్రసాద్..నిర్మాతగా తన కలలను నెరవేర్చుకోవాలని అనుకున్నాడు.అలా కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. కన్నడలో హరిప్రసాద్, రఘుబాబుతో కలిసి రీమేక్‌ చేశారు. తొలి ప్రయత్నం విజయవంతమైంది. ఆ ఉత్సాహంలో మరో రెండు సినిమాలు నిర్మిస్తే ఈసారి నష్టాలొచ్చాయి.ఇక్కడ సినిమాలో నిర్మాతగా వ్యవహరించిన ప్రతి ఒక్కటి కూడా భారీ డిజాస్టర్ ను చవిచూశాయి దీంతో అటు నటుడిగా అవకాశాలు లేక, ఇటు నిర్మాతగా మరో సినిమా చేసే ధైర్యమూ లేక ఆహుతి ప్రసాద్‌ కెరీర్‌ క్లిష్టపరిస్థితిలో పడింది. కాన్సర్ వ్యాధితో బాధపడుతూ జనవరి 4, 2015న కిమ్స్ హాస్పిటల్ లో కాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ మరణించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news