Moviesఅభిమానుల కోసం మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన బాలయ్య.. రికార్డ్ లు...

అభిమానుల కోసం మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన బాలయ్య.. రికార్డ్ లు బద్దలు అవ్వడం ఖాయం..!!

సినిమా అంటేనే వైవిధ్యం. వయసు మీదుపడుతున్నా -వైవిధ్యం విషయంలో బాలయ్య ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. రూలర్ తరువాత బాలయ్య -బోయపాటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే.సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ పోషిస్తుండటం విశేషం. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు పాత్రల్లో బాలయ్య కనిపిస్తున్నారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.ద్వారక క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. బోయపాటి. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో నాయిక పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ రోర్, ఫస్ట్ లుక్ పోస్టర్ల సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. తాజాగా చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకునింది కానీ బాలయ్య అభిమానుల్లో మాత్రం చిన్న నిరాశలో ఉన్నారు.

ఎందుకంటే..బాలయ్య సినిమా అంటేనే అభిమానులు చూసేది వెయిట్ చేసేది మాస్ లుక్ కోసం మాస్ పాటల కోసం.. ఫస్ట్ సింగిల్ అనగానే మంచి మాస్ అండ్ పవర్ ఫుల్ సాంగ్ కోసం ఎక్కువ మంది ఆశించారు. కానీ అది జరగలేదు. దీంతో అభిమానులు కొంచెం డిసప్పయింట్ మెంట్ లో ఉన్నాట్లు తెలుస్తుంది. దీంతో త్వరలోనే అఘోరా లుక్ లో ఉన్న బాలయ్య రోల్ కి చెందిన పవర్ ఫుల్ మాస్ నెంబర్ ని రిలీజ్ చెయ్యబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు కలగలుపుతూ ఈ సినిమా రూపొందిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news