Moviesకన్నతల్లిదండ్రుల పైనే పోలిస్ కేసు పెట్టిన స్టార్ హీరో..రీజన్ ఏంటో తెలుసా..??

కన్నతల్లిదండ్రుల పైనే పోలిస్ కేసు పెట్టిన స్టార్ హీరో..రీజన్ ఏంటో తెలుసా..??

ఏంటి ఓ స్టార్ హీరో తన తల్లిదండ్రుల పైన కేస్ పెట్టారా..?? షాకింగ్ గా ఉంది గా..?? అసలు నమ్మట్లేదుగా..?? ఫేస్ న్యూస్ అనుకుంటున్నారా..?? కాదండి. ఇది నిజం. నిజంగానే ఓ స్టార్ హీరో తన పెరంట్స్ పై పోలిసులకు ఫిర్యాదు చేసారు. ఎంతకి ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?? ఆయన మరెవరో కాదు కోట్లాది ప్రేక్షకులోను తన నటనతొ ఫిదా చేసిన తమిళ స్టార్‌ హీరో ‘ఇళయదళపతి’.. విజయ్‌ తన తల్లిదండ్రుల పైనే కేసు పెట్టారు. ఈ వార్త విజయ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా షాక్ కి గురి చేసింది.

గత ఏడాది విజయ్ తండ్రి చండ్ర శేఖర్.. ‘ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ అనే పేరు మీద రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇక ఇందులో ఈయన జనరల్ సెక్రెటరీగా, ఈయన భార్య శోభ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అది విజయ్ కి నచ్చలేదు. అందుకే తన తండ్రి పెట్టిన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఆ మధ్య ఒక ప్రెస్ నోట్ వదిలారు. ఈ క్రమంలో విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరును గానీ, అలాగే తన ఫొటోను గానీ వాడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయినా విజయ్‌ తల్లిదండ్రులు.. పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ విజయ్ పేరును వాడుతూనే ఉన్నారు. దాంతో తమిళ హీరో విజయ్ ఆదివారం తన తల్లిదండ్రులు సహా 11 మందిపై చెన్నై సిటీ కోర్టులో సివిల్ సూట్ దాఖ‌లు చేశారు. వారు అనుమతి లేకుండా తన పేరును వినియోగిస్తున్నార‌ని విజ‌య్ త‌న సివిల్ సూట్‌లో పేర్కొన్నారు. ఇకపై వాళ్లు తన పేరుతో ఎలాంటి స‌మావేశాలు ఏర్పాటు చేయ‌కుండా, కార్యక్రమాలు నిర్వ‌హించ‌కుండా స్టే ఇవ్వాల‌ని ఆయ‌న కోర్టును అభ్య‌ర్థించారు. అంతేకాదు విజ‌య్ మ‌క్క‌ల్ ఇయ్య‌క‌మ్ రాజ‌కీయ పార్టీని ర‌ద్దు చేయాల‌ని విజ‌య్ కోరారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news