Moviesఆమె లిప్ లాక్ చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్.. ఆ హీరోయిన్...

ఆమె లిప్ లాక్ చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

రకుల్ ప్రీత్ సింగ్.. పదేళ్ల కింద కన్నడ సినిమా గిల్లితో ఇండస్ట్రీకి వచ్చింది ఈ భామ. ఆ తర్వాత హిందీలో యారియాన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ వెంటనే సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ అందుకుంది. వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్‏గా కొనసాగింది.

మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్. ఈ భామ తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. బీటౌన్‏లో ఫుల్ బిజీగా ఉంది. అటు సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ ఫోటోలను.. తన సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అయితే ర‌కుల్‌ ఎంత పెద్ద హీరోయిన్ అయిన్న కొన్ని సెంటిమెంట్స్ ను ఖచ్చితంగా ఫాలో అవుతుంద‌ట. రకుల్ ప్రీతిసింగ్ ఏదైనా సినిమా షూటింగ్ కు వెళ్లలంటే.. ఆమె ల‌క్కీ డేట్లు చుసుకుని వెళ్తుందట. అంతే కాదు తనకు 8 నంబర్ అంటె అస్సలు ఇష్టం లేదట. ఈ తేదీన ఆమె సినిమా షూటింగ్ లో అడుగు పెడితే .. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ఆమెకు ఓ నమ్మకం ఉందట. అంతే కాదు ఆమె ఏదైనా సినిమాలో లిప్ లాక్ సీన్ ఉంటే కచ్చితంగా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఆమె గట్టి నమ్మకంట. ఇక ఇవి తెలుసుకున్న నెటిజన్స్ ..”ఏంటో ఈ రకుల్..పిచ్చి నమ్మకాలు”అంటూ కొట్టిపడేస్తున్నరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news