Gossipsబిగ్ బాస్ లోకి స్టార్ దంపతులు..ఇక TRP's దూసుకుపోవాల్సిందే ..?

బిగ్ బాస్ లోకి స్టార్ దంపతులు..ఇక TRP’s దూసుకుపోవాల్సిందే ..?

ప్రేక్షకులు ఎప్పుడేప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 అతి త్వరలోనే మనముందుకు రానుంది. దీనికి సంబంధించి స్టార్ మా ఓ అదిదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. త్వరలో మీ అందరిని పలకరించేందుకు ముందు వస్తున్నామంటూ అధికారికంగా స్టార్ మా లో తెలిపారు షో మేకర్స్. ఈ క్ర‌మంలో బిగ్‌బాస్ ఐదో సీజన్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మీడియం రేంజ్ యాంక‌ర్లు, చిన్నా చిత‌కా యాంక‌ర్లే కాదు టాప్ యాంక‌ర్లు సైతం త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేస్తున్నార‌ని టాక్.

తాజాగా బిగ్ బాస్ ఐదో సీజన్‌కు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. నాగార్జున రంగంలోకి దిగి తన గన్నుతో బోర్డంను కాల్చి అవతలపారేశాడు. బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రొమోకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం చేయగా, ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా జె యువరాజ్‌ చేశారు. ఇదిలాఉంటే ఈ సీజన్‌లో కంటెస్టెంట్ ఎవరన్న ఆసక్తి అందర్లోనూ ఉండగా.. అనేక పేర్లు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రొమాంటిక్ డ్యాన్స్ జంటను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపుతున్నట్టు సమాచారం.బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్ వితిక జంటను తీసుకున్నట్టే ఈ సీజన్లో కూడా ఒక సెలబ్రిటీ జంట ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఓ క్రేజీ డ్యాన్స్ కపుల్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నట్లు తెలుస్తుంది. ఆట సందీప్ అతని భార్య జ్యోతి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు సందీప్ తన ఫేస్ బుక్ స్టోరీలో ..మేమిద్దరం బిగ్ బాస్ షోలో ఉండాలని, చూడాలని ఎంత మంది అనుకుంటున్నారు? అని పోల్ పెట్టాడు.

షాకింగ్ ఏమిటంటే.. 83 శాతం మంది వాళ్లిద్దరిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలి అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక సందీప్ తాజాగా ఇచ్చిన హింట్ తో ఈ జంట బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ పక్కా అని తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఎవరు ఉంటారు అనే విషయం తెలియాలంటే షో ప్రారంభం అయ్యే వరకు వేచి చూడాల్సిందే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెప్టెంబర్ రెండో వారంలో మొదలు అవుతుందని వార్తలు వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news