Moviesఎన్టీఆర్ తర్వతే ప్రభాస్.. డాషింగ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..?

ఎన్టీఆర్ తర్వతే ప్రభాస్.. డాషింగ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..?

దర్శక బాహుబలిగా పేరు పొంది ప్రపంచ వ్యాప్తంగా క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ఎస్ ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా క్రెడిట్ ని ఎవరికి అందనమత ఆకాశానికి ఎత్తేసి ప్రపంచవ్యాప్తంగా ఒక్క బాహుబలి అనే పేరుతో సంచలనం సృష్టించిన దర్శకుడు ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా మార్కెట్ ఈ రోజు ఖండాంతరాల లో వ్యాప్తి చెందింది అంటే అది కేవలం రాజమౌళి వల్లనే అనేది జగమేరిగిన సత్యం. సినిమాలు ఎవరైనా తీస్తారు.. కానీ ప్రజలకు నచ్చే విధంగా..వాళ్ళు మెచ్చే విధంగా తీయడమే రాజమౌళి స్పెషాలిటి.

అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి పేరుంది. అయన ఒక్కో సినిమాని ఓ శిల్పం లాగా చెక్కుతారు అందుకే అయనకి జక్కన్న అని పేరుంది. ప‌ర్‌ఫెక్షన్ కోసం ఎన్ని షాట్స్ అయిన తీస్తారు.. ఒక్కో సినిమాకి ఎన్నో సంవత్సరాలు కేటాయిస్తారు అందుకే టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఇప్పుడు రాజమౌళి ఉన్నారు.

ప్రతిష్టాత్మక దర్శకుడు రాజమౌళి మరియు జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య మంచి స్నేహం అనేకంటే అంతకంటే ఎక్కువ అనుబంధం ఉందని చెప్పొచ్చు. ‘స్టూడెంట్ నంబర్ వన్’ చిత్రంతో దర్శకుడిగా మారిన రాజమౌళి నాటి నుండి సక్సెస్ అనే మాటకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.

ఇక తనకు ఇష్టమైన హీరోయిన్ అనుష్క, తనకిష్టమైన హీరోలలో ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ అని తెలియజేశాడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇక తనకి ఇష్టమైన మూవీలు మాయాబజార్ అని కూడా ఒక ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్ అడిగే ప్రశ్నలకు సమాధానం తెలియజేశాడు రాజమౌళి. ఏది ఏమైనా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో దర్శకధీరుడు జత కలవడం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news