GossipsNTR-ANR లను విడగొట్టిన సినిమా ఇదే..??

NTR-ANR లను విడగొట్టిన సినిమా ఇదే..??

నందమూరి తారక రామారావు.. ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ముందు కథానాయకుడిగా.. ఆ తర్వాత మహానాయకుడిగా ఆయన జీవితం ఆదర్శప్రాయం. ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ . మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే.అభిమాన జనానికి ఎన్టీఆర్ యుగపురుషుడు- కారణ జన్ముడు.

ఇక నందమూరి తారక రామారావు నతించిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ, సినీ ఇండస్ట్రీలో ఒక్క సంవత్సరం ఎన్టీఆర్ పని అయిపోయింది కొందరు అనుకున్నారు. అలాంటి వాళ్లకు చెంపపెట్టు గా తీసిన సినిమానే “దానవీరశూరకర్ణ”. తాను తలుచుకుంటే ఎలాంటి సినిమాలు చేస్తాను అన్నదానికి ఇదే నిదర్శనం.

జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన దానవీరశూరకర్ణ టాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. తనే దర్శకుడిగా, నిర్మాతగా ఉంటూ మూడు పాత్రలు వేస్తూ ప్రపంచంలో ఏ నటుడు చేయలేని సాహసం చేసాడు ఎన్టీఆర్. కేవలం 43 రోజుల్లోనే దానవీరశూరకర్ణ లాంటి అద్భుతాన్ని తెరకెక్కించాడు.

కానీ ఈ సినిమా కారణంగానే NTR-ANR విడిపోయారని అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ నడిచింది. ఈ సినిమా ను తెరకెక్కించే సమయంలో NTR-ANR ను మహా వీరుడు అయిన కర్ణ పాత్రను పోషించమని అడిగితే.. ANR అస్సలు ఒప్పుకోలేదట. పోనీ.. కృష్ణుడి పాత్రను అయిన సరే పోషించమని అడిగితే అందుకు కూడా ఆయన ఒప్పుకోలేదట. దీని కారణం గా వీరి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి..మంచి స్నేహితులుగా ఉన్న NTR-ANR లు శత్రువులు గా మారిపోయారని అప్పట్లో అనుకునేవారు. ఇక ఆ తరువాత సుమారు 10 నుంచి 12 సంవత్సరాల తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగి.. మళ్లీ కలిసిపోయారని చెబుతుంటారు సినీ ఇండస్ట్రీ పెద్దలు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news