Moviesనటుడిగా నాని తొలి సీన్ ఏంటో తెలుసా ..?

నటుడిగా నాని తొలి సీన్ ఏంటో తెలుసా ..?

అభిమానులు నాచురల్ స్టార్ నాని అని ముద్దుగా పిలుచుకునేవారు. అయితే చాలా మంది నాని అష్టా చమ్మ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన మొదట సహాయ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత , సినిమాల మీద ఆసక్తితో అష్టాచమ్మా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. తర్వాత ఎన్నో సినిమాలలో నటించి, తన కంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు నాని. మొదటి సారి కెమెరా ముందు ఏ సీన్ లో నటించారు అని అడగగా, అందుకు సమాధానంగా ఇలా వివరించాడు.

Nani (actor) - Wikipedia

సాధారణంగా కెమెరా ముందు మొదటి సారి నేను కనిపించినప్పుడు, నా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తే వి. అవి ఏమిటంటే, నేను ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించగలనా..? షాట్ బాగా వస్తుందా..? దర్శకుడికి నా నటన నచ్చుతుందా..? అని ఎన్నో సందేహాలు నా మదిలో మెదిలేవి. కానీ ఈ సినిమా చేస్తే మరి కొత్త అవకాశాలు వస్తాయా..? లేదా..? అనే విషయాలను మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రస్తుతం కెమెరా ముందు ఉన్నప్పుడు ఆ సీన్ కంప్లీట్ అయిపోతే చాలు అని మాత్రమే అనుకునేవాడిని అంటూ తెలిపాడు నాని.

Nani web series on Netflix - tollywood

మొదటిసారి తన కెమెరా ముందుకు వచ్చినప్పుడు అష్టాచమ్మా సినిమాలో ఒక సీన్ ..”కాఫీ షాప్ లో స్వాతిని కలవడం. అలా అవసరాల శ్రీనివాస్ నాకు కాఫీ షాప్ లో ఉన్న స్వాతిని చూపించినప్పుడు, హాయ్ అని చెప్పుకుంటూ అక్కడికి వెళ్లే సీన్ అది. అది చేసినప్పుడు చాలా సులభంగానే అనిపించింది. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను జాయిన్ అయినప్పుడు, అక్కడున్న కెమెరాలు, సహ దర్శకులతో కలిసి భోజనం చేయడం,అక్కడ నటించే నటీనటులను గమనిస్తూ ఉండడం ఇవన్నీ నాకు అలవాటయ్యాయి. కాబట్టి వీటి గురించి నేను పెద్దగా కష్టపడలేదు. ఇక ప్రస్తుతం ఎన్ని సినిమాలు తీసినా, ఇప్పటికీ అష్టాచమ్మా లోని ఈ సీన్ నాకు చాలా ప్రత్యేకం అంటూ తెలిపాడు నాని.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news