Moviesడార్లింగ్ ప్రభాస్‌కు ఊపిరి పోసిన సినిమా ఇదే..!!

డార్లింగ్ ప్రభాస్‌కు ఊపిరి పోసిన సినిమా ఇదే..!!

ఛ‌త్ర‌ప‌తి .. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. టాలీవుడ్ బక్స్ ఆఫిస్ ని షేక్ చేసిన సినిమా ఇది అనే చెప్పలి. మన డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెంచేసిన సినిమా ఇదే. అప్పటి వరకు వర్షం సినిమా మినహా మరో హిట్ లేని ప్రభాస్‌కు ఛత్రపతి ఊపిరి పోసింది. కేవలం ఊపిరి కాదు రెబల్ స్టార్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తీసుకొచ్చింది. ఇందులో డైలాగ్స్ అధుబుతం. ఇప్పటికి టీవిలో వచ్చిన.. చాలా మంది ప్రేక్షకులు టీవికి అతుక్కుపోయి చూస్తుంటారు. ఛత్రపతి సినిమా అప్పట్లో ఓ సంచలనం. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ముఖ్యంగా ఛత్రపతి ఫస్టాఫ్ అయిపోయిన తర్వాత అంతా పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. ఈ సినిమా అప్పట్లో 27 కోట్ల వరకు వసూలు చేసింది. ఆడి బాడీ బాక్సాఫీస్ అంటూ సినిమాలో చెప్పిన డైలాగ్ అక్షరాలా నిజమైంది.

జక్కన డైరెక్ష‌న్ లో వ‌చ్చిన‌ ఛ‌త్ర‌ప‌తి మ‌ళ్లీ 16 ఏళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సంగ‌తి మనకు తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛ‌త్ర‌ప‌తి రీమేక్ తో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఇప్ప‌టికే ఎస్ఎస్ రాజ‌మౌళి స‌మ‌క్షంలో గ్రాండ్ గా సినిమా లాంఛ్ కూడా అయింది. అయితే ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ ఎవ‌రు పోషిస్తార‌నే దానిపై ర‌కర‌కాల పేర్లు తెర‌పైకి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి వెళ్లిపోయాయి. తాజాగా మరో భామ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆ బ్యూటీ ఎవ‌రో కాదు..రెజీనా క‌సాండ్రా.

రెజినాకు టాలెంట్ ఉన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ఇప్ప‌టికే సోన‌మ్ క‌పూర్ తో ఏక్ ల‌డ్‌కీ కో దేఖా తో ఐసా ల‌గా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రెజీనా. ఛ‌త్ర‌ప‌తి రీమేక్ కు గ్రీన్ సిగ్న‌ల్ పై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్‌..రెజీనాకు హిందీలో ఇది రెండో సినిమా కానుంది. వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని జ‌యంతిలాల్ గ‌డ నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది.

ఈ సినిమా విజయం బెల్లం కొండ సాయి శ్రీనివాస్, వినాయక్, రెజినా వీరి ముగ్గురుకి చాలా అవసరం. చాలా కాలంగా మంచి హిట్ లేని వినాయక్ ఈ సినిమాతోనైనా విజయం సాధిస్తాడో లేదో చూడాలి.టాలీవుడ్ లో లభించని విజయం సాయి శ్రీనివాస్ కు బాలీవుడ్ లో అయిన దక్కుతుందో లేదో చూడాలి. టాలీవుడ్ లో రాని ఆఫర్స్ రెజీనకు బాలీవుడ్ లో అయినా వస్తాయేమో చూడాలి.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news