Moviesమంచి జోష్ మీద ఉన్న తారక్.. ఏం చేసాడొ చూడండి..!!

మంచి జోష్ మీద ఉన్న తారక్.. ఏం చేసాడొ చూడండి..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఈ పేరు చెబుతుంటేనే అదేంటో తెలియని ఓ కిక్కు ఉంటుంది. టాలీవుడ్ లో ఎటువంటి కాంట్రవర్సీలకు పోకుండా..తమ పని తాము చెసుకునే వాళ్ళు చాలా తక్కువ.. అలాంటి వాళ్లలో మన తారక్ ముందుంటారు. ఇక ఈయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి.. ఈయన అడుగు పెడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ .. ఇక ఈయన విజల్ వేస్తే ధియేటర్స్ దద్దరిలాల్సిందే.. ఇక మీసం మెలివేస్తే..ఇంకేముంది మిగతా హీరోలకు దబిడి దిబిడే.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ “RRR” చిత్ర షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ సినిమా “రణం రౌద్రం రుధిరం” పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అనంతరం కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్30 ప్రారంభం కానుంది. ఆ తర్వాత పప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. నిత్యం షూటింగ్‌లో బిబీగా ఉంటే.. ఎన్టీఆర్‌, రాజమౌళి కొంత ఖాళీ సమయంలో దొరకడంతో వాలీబాల్‌ ఆడారు. ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో ఎన్టీఆర్, రాజమౌళి చాలా ఎనర్జిటిక్‌తో వాలీబాల్‌ ఆడుతున్నారు. ఇంతవరకూ ఎన్టీఆర్ ఎలాంటి స్పోర్ట్స్ ఆడుతూ కనిపించలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు మిగతా వాళ్లు కూడా ఈ వైరల్ వీడియోను ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే తారక్ వాలీబాల్ ఆడింది ఎక్కడ అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా భారీ ఎత్తున లైకులు, షేర్లు లభిస్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news