Moviesఅంజలి కెరీర్ లో అది ఓ పెద్ద మిస్టరీ..అంతు చిక్కని రహస్యం..!!

అంజలి కెరీర్ లో అది ఓ పెద్ద మిస్టరీ..అంతు చిక్కని రహస్యం..!!

చాలా మంది ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ హీరోయిన్ అంజలి మాత్రం మొదల రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట్లో గెలిచింది. నిజానికి తెలుగు దర్శకుడు తెలుగు అమ్మాయిలను వదిలేసి.. నార్త అమ్మాయిలను ఇండస్ట్రీలో దింపేస్తారు. మనోళ్లకి ఇక్కడ అవకాశాలు తక్కువ. అంతేకాదు.. తెలుగు అమ్మాయిలు నటన అంటే పెద్దగా ఇష్టపడరు. ఎక్స్ పోజింగ్ చేయరు అనే విమర్శ ఉంది. అయితే తెలుగమ్మాయి అంజలి మాత్రం తమిళ పరిశ్రమలో సత్తా చాటింది. చక్కటి అవకాశాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

మునుప‌టిలా తెలుగ‌మ్మాయిలు చిత్ర‌సీమ‌లో రాణించ‌లేక‌పోతున్నారు- ఈ మాట చాలా రోజులుగా తెలుగు చిత్ర‌సీమ‌లో వినిపిస్తూనే ఉంది. నిజానికి సినిమా రంగంలోని ప‌రిస్థితుల కార‌ణంగా అయితేనేమి, ఇత‌ర‌త్రా అయితేనేమి తెలుగు అమ్మాయిలు అంత‌గా న‌ట‌నారంగంవైపు ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఆలా తక్కువ మందిలో అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి ఒక్కరు. ఆ స‌మ‌యంలో శివ‌నాగేశ్వ‌ర‌రావు తెర‌కెక్కించిన ఫోటో చిత్రంతో అచ్చ‌తెలుగు అమ్మాయి అంజ‌లి ప‌రిచ‌య‌మ‌యింది. ఆమె తెలుగు అమ్మాయి అయినా సరే తమిళ్ లో మొదట ఇన్నింగ్స్ మొదలు పెట్టి తెలుగులో కూడా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది.

అవ్వడానికి తెలుగమ్మాయి అయినా తమిళ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అంజలి. షాపింగ్ మాల్ అనే డబ్బింగ్ సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను కూడా పలకరించింది. టాలీవుడ్ నటి తెలుగు ముద్దుగుమ్మ అంజలి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు అందుకుంది. తాను నటించే సినిమాలలో పాత్రకు ప్రాణం పోసినట్టుగా నటిస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషలలో కూడా నటించింది అంజలి. తెలుగు అమ్మాయి ఐనా అంజలి తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం అంత గుర్తింపు అందుకోలేదు.

కొన్ని చిత్రాల‌లో కీ రోల్స్ లోనూ, మ‌రికొన్ని సినిమాల్లో నాయిక‌గానూ న‌టించి అల‌రించిన అంజ‌లికి గీతాంజ‌లి చిత్రం ఉత్త‌మ‌న‌టిగా నంది అవార్డును సంపాదించి పెట్టింది. మునుముందు కూడా త‌న‌దైన అభిన‌యంతో అల‌రించాల‌ని చూస్తోన్న అంజ‌లి అనేక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఇప్ప‌టికే న‌టించి మురిపించింది.

ఇక “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం తర్వాత ఒక్కసారిగా తనకి వచ్చిన పేరు గుర్తింపు కానీ నేను హ్యాండిల్ చెయ్యలేకపోయానని అన్నారు. దానికి తోడు ఇంట్లో కొన్ని కుటుంబ సమస్యలు వీటి మూలాన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సాధారణ అమ్మాయినైన నేను వీటన్నిటిని ఒకేసారి తీసుకోలేకపోయానని అన్నారు. అందుకే వీటన్నిటి నుంచి బ్రేక్ తీసుకోడానికే ఎవరికీ చెప్పకుండా ఒక్కదాన్నే ముంబై వెళ్ళిపోయి కొన్ని రోజులు అక్కడే ఉండి మళ్ళీ వచ్చానని ఆమె తెలిపారు.

ఆ మధ్య కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న అంజలి వాటన్నిటి నుంచి తేరుకుని మళ్ళీ ఫ్రెష్ గా సినిమాలను చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో లీడ్ రోడ్ చేసిన నటి అంజలి దీని ద్వారా తనకు మరిన్ని అవకాశాలు వస్తాయి అని ఎదురు చూస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news