Moviesరాత్రి వేళల్లో చిరంజీవి గోడ దూకి మరి.. ఆ హీరోయిన్ తో...

రాత్రి వేళల్లో చిరంజీవి గోడ దూకి మరి.. ఆ హీరోయిన్ తో అలా చేసేవాడట..?

ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. స్వయం కృషితో ఎదిగిన ఒకెఒక్క స్టార్ హీరో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో మన చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు ఘనత మెగాస్టార్ చిరంజీవి కే సాధమైంది. హీరోగా అడుగు పెట్టినా .. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కష్టఫడి ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. దాదాపు 20ఏళ్ళు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా తెలుగు చిత్ర సీమను ఏలారు మెగాస్టార్ చిరంజీవి. డ్యాన్సులు, ఫైట్స్ అంటూ ప్రేక్షకులకు కొత్త హీరోయిజాన్ని పరిచయం చేశారు చిరు. యంగ్ జనరేషన్ నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికీ తాను నటించే ప్రతి సినిమాను మొదటి సినిమా భావిస్తారని టాక్.

టాలీవుడ్ లో తన 40 ఏళ్ల సినిమా కెరీర్ లో చిరంజీవి ఎన్నో రికార్డులను సృష్టించారు.. దక్షిణాదిలో చిరంజీవి అంటే తెలియనివారుండరు. అయితే మెగాస్టార్ చిరంజీవికి సైతం ఇబ్బంది ఎదురైంది. స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో రాధ – విజయశాంతి – సుహాసిని లాంటి హీరోయిన్లతో ఎక్కువగా సినిమాలు చేసేవారు. ఈ క్రమంలోనే చిరంజీవి – రాధిక కాంబినేషన్ కు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేదిగా ఈ విషయం మనకు తెలిసిందే. మన రాధిక ఏం తక్కువ ఆ టైంలో చిరంజీవితో పోటీపడి మరీ డ్యాన్సులు చేస్తూ మనల్ని అలరించేవారు .

అప్పట్లో చిరంజీవి ఏ షూటింగ్స్ కు వెళ్ళిన తన భార్య సురేఖను వెంట పెట్టుకుని మరి ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లిపోయే వారట. మార్నింగ్ అంతా చిరంజీవి షూటింగ్ ల‌తో బిజీ బిజీగా ఉండేవారు. అయితే ఆయన భార్య సురేఖ మాత్రం ఒక్కరే షూటింగ్‌ ప్రదేశాలను ఎంజాయ్ చేసేవారట. ఇక రాత్రి వేళల్లో కొన్నిసార్లు షూటింగ్ అయ్యాక కూడా వాళ్ళు ఉంటున్న గది గోడ దూకి మరి వెళ్లి.. పక్కనే ఉన్న రాధిక దగ్గరకు వెళ్ళే వాడట. ఏందుకు అనుకుంటున్నారా..?? పగలంతా రాధిక‌తోనే షూటింగ్ చేసినా కూడా చిరంజీవి…తరువాతి రోజు సీన్స్ రిహార్స‌ల్స్‌ చేసేవారట. అయితే ఆ సమయంలో రాధిక‌ మాత్రం సురేఖ మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి బ‌ల‌వంతంగా చిరును సురేఖ దగ్గరకు పంపించేద‌ట‌. ఈ విష‌యాన్ని త‌ర్వాత చిరంజీవి భార్య సురేఖ సైతం ప‌లు సంద‌ర్భాల్లో గుర్తు చేసుకుని నవ్వుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news