Gossipsబిగ్ బాస్ హోస్ట్ గా ఆ స్టార్ హీరో.. సమంత కజిన్...

బిగ్ బాస్ హోస్ట్ గా ఆ స్టార్ హీరో.. సమంత కజిన్ నే..?

బుల్లితెర భారీ పాపులారిటీ..రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బిగ్ బాస్.. నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని త్వరలోనే 5వ సీజన్ ( Bigg Boss 5)లో అడుగుపెట్టబోతోంది. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను 4 సీజన్ లతో ఎంతగానో అలరించిన బిగ్ బాస్ త్వరలో 5 సీజన్ ప్రారంభించడానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నారు. దీంతో పార్టిసిపెంట్స్ విషయమై నిత్యం రకరకాల పేర్లు బయటకొస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా .. రాబోయే బిగ్ బాస్ సీజన్ 5 కి సంబంధించిన హోస్ట్ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేమిటంటే రాబోయే బిగ్ బాస్ సీజన్ 5కి రానా దగ్గుబాటి హోస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. గ‌తంలో ముందుగా బిగ్ బాస్ 3,4 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈసారి ఆ ప్లేస్ లో.. ఆరు అడుగుల అందగాడు రానా దగ్గుబాటి ని హోస్ట్ గా పెట్టాలని అనుకుంటున్నారట. వెండితెరపై భల్లాల దేవుడుగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బహుబలి నటుడు రానా దగ్గుబాటి.. బుల్లితెరపై నెం. 1 యారి షోతో హోస్ట్‌గా అలరించారు.

నిజానికి బిగ్ బాస్ సీజన్ 5 ఈ సమ్మర్‌లో ప్రారంభించాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా అది కాస్తా వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మళ్లీ అదుపులోకి వస్తుండటంతో ఐదో సీజన్‌ను మొదలు పెట్టేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇందులో భాగంగానే ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక కొనసాగుతోందని సమాచారం. ఈ సారి మరింత కొత్తగా షోని నడిపించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. పాపులర్‌ అయిన నటీనటులను మాత్రమే షోలోకి తీసుకోబోతున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news