Gossipsన‌య‌న‌తార కొత్త రేటు చూస్తే స్టార్ హీరోలు బ‌లాదూర్‌..!

న‌య‌న‌తార కొత్త రేటు చూస్తే స్టార్ హీరోలు బ‌లాదూర్‌..!

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది అందాల భామ నయనతార. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాయన తార లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. న‌య‌న‌తార అందం అభినయం ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది.

ఇక తెలుగు,తమిళ్ లోనే కాదు మలయాళంలోనూ రాణిస్తుంది ఈ బ్యూటీ. కథలో కొత్తదనం ఉండే సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. ఆచితూచి సినిమాలను చేస్తుంది నయనతార. సౌత్ లేడి సూపర్ స్టార్ గా నిలిచిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఎన్నో పాత్రలతో మెప్పించి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించిన ఈ బ్యూటీ చేతిలో బోలెడు సినిమా అవకాశాలు ఉన్నాయి.

అయితే పదిహేనేళ్లుగా సౌత్‌లో అగ్ర కథనాయికగా రాణిస్తున్న నయనతార ఇంతవరకూ హిందీ సినిమా చేయలేదు. ఇప్పటివరకు దక్షిణాది చిత్రాలకే పరిమితమైప నయనతార తొలిసారిగా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ కి రెడీ అయ్యినట్లు తెలుస్తుంది. డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ సినిమాలో జోడీ క‌ట్టేందుకు రెడీ అవుతుంది ఈ లేడీ సూపర్‌ స్టార్‌. అంతేకాకుండా రెమ్యునరేషన్‌ కూడా భారీగా పెంచేసింది ఈ భామ. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకునే నయనతార ఇప్పుడు బాలీవుడ్‌ డెబ్యూ కోసం రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసింది.

బాలీవుడ్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూ.6-8 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్‌ చేసిందట. ఆమె కి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే సౌత్ ఇండ‌స్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయన్‌ పేరు ముందుంటుంది. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్‌ డెబ్యూ అనగానే పారితోషికాన్ని డబుల్‌ చేయడంతో ఇక చేసేదేం లేక అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news