Healthవీటిని ఎట్టి పరిస్థిలో ఫ్రిడ్జ్ లో పెట్టకండి.. ఎందుకంటే..??

వీటిని ఎట్టి పరిస్థిలో ఫ్రిడ్జ్ లో పెట్టకండి.. ఎందుకంటే..??

ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఎడాపెడా.. దొరికిన పదార్థాలన్నీ అందులో తోసేస్తున్నారా ? ఏ వస్తువు తీసుకొచ్చినా.. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే.. ఫ్రెష్ గా ఉంటుందని భావిస్తున్నారా ? అయితే మీరు పొరబడ్డట్టే. నేటి రోజుల్లో ఫ్రిజ్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కేవలం ధనికుల ఇళ్లలో మాత్రమే రిఫ్రిజిరేటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు సామాన్యులు సైతం ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు వాడుతున్నారు. ఆహారాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఫ్రిజ్ లను ఉపయోగించాలి నిజమే, కానీ.. కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఆహారపదార్థాలు తాజాగా ఉండటం ఏమో కానీ అనారోగ్యం పాలవుతాం. కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయి. న్యూట్రీషన్స్ తగ్గిపోతాయి. అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక ఫ్రిడ్జ్ లో పెట్టే ముందు ఎలాంటి పదార్థాలు పెట్టాలి అవగాహనకు రండి. అలా ఫ్రిడ్జ్ లో పెట్టకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గుడ్లు: ఉడికించిన గుడ్లును ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిది కాదు. ఉడికించిన గుడ్డును ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల పెద్దగా అయ్యి, చీలికలు ఏర్పడి లోపల బ్యాక్టీరియాకు కారణమవుతుంది. అందుకు గుడ్డును ఏరూపంలోనూ ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదు.

టమాటాలు : టమాటాలను ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచకూడదు. చల్లటి ప్రదేశాల్లో టమాటాలు పాడైపోతాయి. మెత్తగా, నీరు పట్టినట్లు ఉబ్బిపోతాయి. ఫ్రిజ్‌లో ఉంచితే… టమాటాల ఫ్లేవర్ కూడా పోతుంది.

డైరీ ప్రొడక్ట్స్ : పాలను ఫ్రీజర్ లో ఉంచడం మంచిది కాదు, పాలు గట్టిగా మారుతాయి. అలాగే పాలు వేడి చేసినప్పుడు గడ్డగడ్డలు కనబడుతుంది. పాలు మాత్రమే కాదు, పాలప్రొడక్ట్స్ ఏవైనా చివరికి చీజ్ కూడా ప్రిడ్జ్ లో పెడితే ఆకారం మారుతుంది. .

బ్రెడ్ :రొట్టె, బ్రెడ్ వంటివి ఫ్రిజ్‌లో పెడితే… వెంటనే పాడైపోతాయి. వాటిని గదిలోనే కాస్త చల్లగా, పొడిగా ఉన్న ప్రదేశాల్లో ఉంచొచ్చు

ఫ్రైడ్ ఫుడ్స్ : ఫ్రై చేసిన ఆహారాలు వెంటనే తినేయాలి. వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచి తినడం వల్ల పొట్ట సమస్యలు వస్తాయి. ఫ్రైడ్ ఫుడ్స్ ను ఫ్రిడ్జ్ లో ఉంచి తిరిగి వేడి చేసి లేదా అలాగే తినడం వల్ల గుండె కు సంబంధించిన వ్యాధుల, ఊబకాయం, వంటి సమస్యలు వస్తాయి.

చాకొలెట్స్‌: చాకొలెట్స్‌ని చాలా మంది కూల్ చేసుకొని తింటారు. నిజానికి వాటిని కూల్ చేసి తింటే… టేస్ట్ ఉండవు. కలర్, టెక్చర్‌ కూడా మారిపోతుంది. చాకొలెట్లు ముఖ్యంగా కోకో బటర్ చాకొలెట్లు… తమ చుట్టూ ఉన్న వాసనల్ని పీల్చుకుంటాయి. అందువల్ల వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇంకా..కాఫీ పొడి, బ్రెడ్, పీనట్ బటర్, కచేప్, నారింజ లు లాంటివి ఫ్రిజ్లో పెట్టకూడదు అని చెబుతున్నారు ఇలాంటివి రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news