Moviesఎన్టీఆర్ వ‌ర్సెస్ నాగార్జున... పెద్ద యుద్ధ‌మే జ‌రిగేలా ఉందే ?

ఎన్టీఆర్ వ‌ర్సెస్ నాగార్జున… పెద్ద యుద్ధ‌మే జ‌రిగేలా ఉందే ?

టాలీవుడ్‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, కింగ్ నాగార్జున మ‌ధ్య అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ నాగ్‌ను బాబాయ్ బాబాయ్ అంటూ ఎంతో అప్యాయంగా పిలుస్తూ ఉంటారు. నాగార్జున కూడా ఎన్టీఆర్‌ను ఓ అబ్బాయ్ లా గౌర‌విస్తారు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య బుల్లితెర మీద పెద్ద యుద్ధ‌మే న‌డిచేలా ఉంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమినీ టీవీలో త్వ‌ర‌లోనే మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. క‌రోనా కార‌ణంగా ఈ ప్రోగ్రామ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ముగిసిన వెంట‌నే ఎన్టీఆర్ ఈ షో కోసం హాట్ సీట్లో కూర్చోనున్నాడు.

గ‌తంలో ఇదే షో స్టార్ మాలో వ‌చ్చింది. అప్పుడు నాగార్జున హోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి ఎన్టీఆర్ వ‌స్తున్నాడు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఇక స్టార్ మాలో ప్రసారం అయ్యే బిగ్‌బాస్ షో నాలుగో సీజ‌న్ త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. దీనిని నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ ఫ‌స్ట్ సీజ‌న్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. ఆ త‌ర్వాత అది నాగార్జున చేతుల్లోకి వెళ్లింది. ఇలా తెలుగు బుల్లితెర ప్రేక్షుక‌ల‌ను ఉర్రూత‌లూగించిన ఈ రెండు షోలు ఒకేసారి ప్రారంభ‌మైతే బుల్లితెర ప్రేక్ష‌కులు మామూలుగా ఎంజాయ్ చేయ‌రు.

అయితే ప్రేక్ష‌కుల‌కు ఈ రెండు షోలు ఒకేసారి రావ‌డం వీనుల విందే అయినా.. పోటీ ప‌రంగా , రేటింగ్స్ ప‌రంగా గొడ‌వ‌లు, కంపేరిజ‌న్లు రావ‌డంతో పాటు స్టార్ మాకు, ఇటు జెమినీకి వ్యాపార పరంగా కూడా పెద్ద దెబ్బే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news