Moviesఆచార్య శాటిలైట్ డీల్ క్లోజ్‌... టాప్ రేటుకు జెమినీ సొంతం

ఆచార్య శాటిలైట్ డీల్ క్లోజ్‌… టాప్ రేటుకు జెమినీ సొంతం

ఆచార్య సినిమా మ‌రో రెండు రోజుల్లో సెట్స్ మీద‌కు రానుంది. కొత్త పెళ్లి కూతురు కాజల్ కూడా సెట్లోకి వ‌చ్చేయ‌నుంది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఆచార్య సెట్స్ మీద‌కు రాబోతోంది. ఇదిలా ఉంటే ఆచార్య శాటిలైట్ డీల్ క్లోజ్ అయ్యింది. జెమినీ ఛానెల్ ఆచార్య శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. చిరు సైరా శాటిలైట్ రైట్స్ అమ్మే విష‌యంలో నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ చెప్పిన రేటు చూసి మిగిలిన ఛానెల్స్ ఎవ్వ‌రూ ఆ సినిమా రైట్స్ కొనేందుకు సాహ‌సం చేయ‌లేదు.

 

ఆ క‌న్‌ఫ్యూజ్‌కు ఇక్క‌డ ఛాన్స్ ఇవ్వ‌కూడ‌ద‌ని ఆచార్య మేక‌ర్స్ డిసైడ్ అయ్యారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ సినిమాకు ఇంకా శాటిలైట్ రైట్స్ అమ్ముడు కాలేదంటే రిలీజ్‌కు ముందు మెయిన్ బిజినెస్‌తో పాటు ఓ నెగిటివ్ ఇంఫాక్ట్ ఎక్కడ ప‌డుతుందో ? అన్న ఆందోళ‌న‌తోనే మేక‌ర్స్ కాస్త మెట్టు దిగి ఆచార్య శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ చేసేశారు. కొరటాల శివ డైరక్ట్ చేస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మణిశర్మ సంగీత దర్శకుడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news