రాజ‌మౌళి విల‌న్ సుప్రీత్ ఎవ‌రో తెలుసా..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సినిమాల్లో విల‌న్‌కు ఎలాంటి ప్రాధాన్య‌త ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. రాజ‌మౌళి సినిమాలో బ‌ల‌మైన విల‌న్ ఉండాల్సిందే. విల‌న్ బ‌లంగా ఉంటేనే హీరో ఎలివేట్ అవుతాడ‌ని రాజ‌మౌళి ఎప్పుడు చెప్పుతూ ఉంటాడు. రాజ‌మౌళి సినిమాల్లో విల‌న్‌గా న‌టించాడు సుప్రీత్‌. సుప్రీత్‌రెడ్డి అన‌గానే మ‌న‌కు పేరు కొత్త‌గా ఉండొచ్చు.. కానీ మ‌న‌కు అత‌డు ప‌రిచ‌యమే. సుప్రీత్ ప‌వ‌న్ జానీ సినిమాలో చిన్న పాత్ర‌లో న‌టించాడు.

TeluguStop.com - రాజమౌళి విలన్ సుప్రీత్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సుప్రీత్‌రెడ్డి జిల్లా స్థాయిలో మంచి వాలీబాల్ ప్లేయ‌ర్ జాని సినిమాలో సుప్రీత్‌ను చూసిన రాజ‌మౌళి త‌న సై సినిమాకు అవ‌కాశం ఇచ్చాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుప్రీత్ ప్ర‌తిభ చూసిన రాజ‌మౌళి ఛ‌త్ర‌ప‌తి సినిమాలో విల‌న్‌గా అవ‌కాశం ఇవ్వ‌గా అదిరిపోయే రేంజ్‌లో మెప్పించాడు.

Supreeth - Alchetron, The Free Social Encyclopedia

ఈ సినిమా త‌ర్వాత సుప్రీత్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఇక బ్లాక్‌బ‌స్ట‌ర్ బాహుబ‌లిలో కూడా సుప్రీత్ న‌టించాడు. ప‌లు బాలీవుడ్‌, టాలీవుడ్ సినిమాల్లో విల‌న్‌గా మెప్పించాడు. చివ‌ర‌గా సుప్రీత్ న‌టించిన సినిమా ప్ర‌భాస్ సాహో.