Moviesరాధే శ్యామ్‌పై సూప‌ర్ అప్‌డేట్‌... ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను ఆప‌లేం..!

రాధే శ్యామ్‌పై సూప‌ర్ అప్‌డేట్‌… ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను ఆప‌లేం..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధే శ్యామ్ సినిమా కోసం ఇండియా సినిమా ల‌వ‌ర్స్ ఎంత ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారో చెప్ప‌క్క‌ర్లేదు. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు కావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఫ్యూజులు ఎగిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాధే శ్యామ్ టీజ‌ర్‌ను ఆ రోజు రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ముందుగా మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేయాల‌నుకున్నా… సినిమాపై మ‌రింత బ‌జ్ క్రియేట్ చేయాల‌న్నా.. పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ రావాల‌న్నా టీజ‌రే బెట‌ర్ అని యూనిట్ డిసైడ్ అయ్యిందంటున్నారు.

 

తాజాగా యూర‌ప్ వెళ్లిన ఈ సినిమా యూనిట్ స‌భ్యులు టీజ‌ర్ కోస‌మే కొన్ని షాట్స్ షూట్ చేశార‌ట‌. దీంతో ప్ర‌భాస్ బ‌ర్త్ డే కానుక‌గా రాధే శ్యామ్ టీజ‌ర్ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే టీజ‌ర్ క‌ట్టింగ్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని.. త్వ‌ర‌లోనే ఫైన‌ల్ అవుట్ ఫుట్ చూశాక టీజ‌ర్ రిలీజ్‌పై అధికారిక ప్రక‌ట‌న వ‌స్తుందంటున్నారు.

 

ఏదేమైనా చాలా రోజుల  వ‌ర‌కు రాధే శ్యామ్  అప్‌డేట్ లేక‌పోవ‌డంతో డిజ‌ప్పాయింట్‌తో ఉన్న ప్ర‌భాస్ ఫ్యాన్స్ కేవ‌లం ఆదిపురుష్ అప్‌డేట్స్‌తోనే కాలం గ‌డుపుతున్నారు. అయితే ముందు లైన్లో ఉన్న సినిమా రాధే శ్యామ్ కావ‌డంతో పాటు ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే యేడాదిన్న‌ర‌గా న‌డుస్తుండ‌డంతో ఏ అప్‌డేట్ లేక నైరాశ్యంలో ఉన్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు టీజ‌ర్ అప్‌డేట్ మంచి జోష్  ఇచ్చింద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news