Gossipsఆ డైరెక్ట‌ర్ కోసం రాజ‌మౌళికే షాక్ ఇచ్చిందే... !

ఆ డైరెక్ట‌ర్ కోసం రాజ‌మౌళికే షాక్ ఇచ్చిందే… !

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్‌ను ప‌ట్టాలెక్కించేశాడు. వీలైనంత త్వ‌ర‌గానే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఏడు నెల‌ల గ్యాప్  త‌ర్వాత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. రామోజీ ఫిల్మ్‌సిటీ సెట్లోకి ఇప్పటికే రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ లాంటి ప్ర‌ధాన తారాగ‌ణం అంతా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో చ‌ర‌ణ్ ప‌క్క‌న సీత‌గా న‌టిస్తోన్న బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ సైతం సెట్లోకి త్వ‌ర‌లోనే ఎంట్రీ ఇవ్వ‌నుంది.

 

 

దీనిపై స్పందించిన ఆలియా భ‌ట్ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూ‌లో  స్పందిస్తూ తాను న‌వంబ‌ర్‌లో  తొలి వారంలో ఆర్ ఆర్ ఆర్ టీంతో జాయిన్ అవుతున్న‌ట్టు చెప్పింది. అప్ప‌టి వ‌ర‌కు ముంబైలో సంజ‌య్ లీలా బ‌న్సాలీ గంగూబాయి కతియావాడి షూటింగ్ లో ఉంటాన‌ని చెప్పింది. గంగూబాయి కతియావాడి ముంబై షూటింగ్ పూర్తయ్యాక కాని ఆమె ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌దు. ఇక ఆర్ ఆర్ ఆర్‌లో ఆలియాతో పాటు మ‌రో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్నాడు.

 

ఇదిలా ఉంటే ఆలియా భ‌న్సాలీ సినిమా కోసం కావాల‌నే ఆర్ ఆర్ ఆర్  కు త‌న కాల్షీట్లు ఇవ్వ‌కుండా ఆల‌స్యం చేసింద‌న్న గుస‌గుస‌లు ఫిల్మ్‌న‌గ‌ర్లో వినిపిస్తున్నాయి. ఆమె ఈ సినిమా ఒప్పుకున్న‌ప్ప‌టి నుంచే  అనేక కండీష‌న్లు పెడుతూ చిత్ర యూనిట్‌ను  నానా ఇబ్బందులు పెడుతోంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news