Moviesప‌వ‌న్ కోసం ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు రెడీ... ప‌వ‌నే లేట్ చేస్తున్నాడే...!

ప‌వ‌న్ కోసం ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు రెడీ… ప‌వ‌నే లేట్ చేస్తున్నాడే…!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ 26వ సినిమా వ‌కీల్‌సాబ్ షూటింగ్ ఆరు నెల‌ల గ్యాప్ త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ప్రారంభ‌మైంది. రెండు మూడు వారాల నుంచి షూటింగ్ న‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ మాత్రం షూటింగ్‌లో జాయిన్ కాలేదు. మ‌రో వైపు ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ మాత్రం ప‌వ‌న్ లేకుండానే సీన్లు షూట్ చేస్తున్నాడు. వాస్త‌వానికి ఈ నెల‌లోనే ప‌వ‌న్ షూటింగ్‌లో జాయిన్ కావాల్సి ఉన్నా మ‌నోడు ఆల‌స్యం చేస్తుండ‌డంతో ద‌ర్శ‌కుడు చేసేదేం లేక మిగిలిన న‌టుల సీన్లు షూట్ చేస్తూ కాలం వెళ్ల‌దీస్తోన్న ప‌రిస్థితి.

 

ఇక ఇప్ప‌టికే ఈ సినిమాలో న‌టిస్తోన్న నివేదా థామ‌స్ షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. ప్ర‌స్తుతం ఆమెపై కొన్ని కీల‌క స‌న్నివేశాలు షూట్ చేస్తున్నారు. నివేద సీన్ల షూటింగ్ పూర్త‌య్యే స‌రికి అయినా ప‌వ‌న్ సెట్స్‌లోకి వ‌స్తాడ‌న్న ఆశ‌తో ఉన్నారు. పవన్ ఇటీవల కన్నడ నటుడు సుదీప్ ను కల‌వ‌గా ఆ స‌మ‌యంలో కూడా పూర్తిగా పెరిగిన‌ గడ్డం, జుట్టు ఉన్నాయి. దీనిని బ‌ట్టి ప‌వ‌న్ ఇంకా షూటింగ్‌కు రెడీ అయిన‌ట్టే లేడే ? అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.

 

ఇక వ‌కీల్‌సాబ్ కోసం ప‌వ‌న్ మూడు వారాల పాటు డేట్లు ఇచ్చాడు. ఈ మూడు వారాల్లోనే షూటింగ్ అంతా ఫినిష్ చేయాల‌న్న కండీష‌న్లు ద‌ర్శ‌కుడు శ్రీరామ్‌కు ఉన్నాయ‌ట‌. ఇక ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర కోసం శృతీహాస‌న్ త్వ‌ర‌లోనే  సెట్‌లో జాయిన్ అవుతోంది. ఇక వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా వ‌కీల్‌సాబ్‌ను థియేట‌ర్ల‌లోకి దింప‌నున్నారు. మ‌రి ప‌వ‌న్ ఎప్పుడు సెట్స్‌లోకి వ‌స్తాడో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news